ఛీ ఛీ వీళ్ళు కొడుకులేన.. మరీ ఇంత దారుణమా?

praveen
నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే అసలు మనుషుల్లో మానవత్వం అనేది బ్రతికి ఉందా అన్న అనుమానం కలుగుతోంది. ఎందుకంటే మానవత్వం ఉన్న మనుషులు కాస్త రాక్షసుల కంటే దారుణంగా మారిపోతున్నారు.  చిన్న చిన్న విషయాలకే ఏకంగా సాటి మనుషుల ప్రాణాలు తీస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. చాక్లెట్ తిన్నంత ఈజీగా ప్రాణాలను తీసేస్తున్నారు. ప్రాణాలు తీస్తే శిక్షలు పడతాయని జైలు పాలు కావాల్సి వస్తుందని భయం మాత్రం ఎవరిలో కనిపించడం లేదు. పరాయి వాళ్ళ విషయంలోనే కాదు సొంత వాళ్ల విషయంలో కూడా జాలి దయ చూపించడం లేదు నేటి రోజులలో జనాలు.

 దీంతో పరాయి వ్యక్తుల నుంచే కాదు రక్తం పంచుకుని పుట్టిన వారిని సైతం ప్రాణహాని ఉందేమో అని ప్రతి మనిషి అనుక్షణం భయపడుతూ బ్రతికే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నేటి రోజుల్లో ఆస్తులకు విలువ ఇస్తున్నట్లుగా బంధాలకు బంధుత్వాలకు మాత్రం ఎవరూ విలువ ఇవ్వడం లేదు అనే చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చిన్నప్పటినుంచి అల్లారుముద్దుగా పెంచిన తండ్రి విషయంలో కాస్తయినా జాలి చూపించలేకపోయారు కొడుకులు. అన్నదమ్ములు కొట్టుకుంటుంటే చూడలేక ఆపుదామని వచ్చిన తండ్రిని దారుణంగా హతమార్చారు.

 గరిడేపల్లి మండల పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మంగాపురం తండా గ్రామ పంచాయతీకి చెందిన ధరావత్ లాలూకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వివాహం తర్వాత ఇద్దరూ గొడవ పడకూడదని వేరు కాపురాలు పెట్టించాడు తండ్రి. ఆ తర్వాత తండ్రి చిన్న కొడుకుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నాడు అంటూ పెద్ద కొడుకు తండ్రి పై పగ పెంచుకున్నాడు. అయితే తండ్రి వద్ద ఉన్న ట్రాక్టర్ కూడా తమ్ముడికి ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు అంటూ పెద్ద కొడుకు సైదులు మరింత ఆగ్రహంతో ఊగిపోయాడు. ఈ క్రమంలోనే ట్రాక్టర్ విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. మాటా మాటా పెరగడంతో చివరికి ఒకరిపై ఒక్కరు చేయిచేసుకున్నారు.ఇది గమనించిన తండ్రి వారిని ఆపడానికి వచ్చాడు. అప్పటికే తండ్రి మీద కోపంతో ఉన్న పెద్ద కొడుకు సైదులు పక్కనే ఉన్నా కర్రతో తండ్రి తలమీద కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు తండ్రి ధరావత్ లాలు. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: