చైనాకు వెయ్యి కోట్లు ఫైన్ వేసిన భారత్...ఎందుకో తెలుసా ?

Vennelakanti Sreedhar

అవును ఇది నిజం..భారత ప్రభుత్వం చైనా మరో షాక్ ఇచ్చింది. గతంలో చైనా ఆప్ లను నిషేధించిన భారత ప్రభుత్వం తాజాగా ఆ దేశ సెల్ ఫోన్ కంపెనీలకు భారీ జరిమానా విధించింది.ఇందుకు సంబంధించిన అధికారిక తాకీదలు ఇంకా చైనాకు,  అదే చైనా దేశపు మొబైల్ కంపెనీలకు ఇంకా అందలేదు.  కానీ జరిమానా విధించడం ఖాయమని ఆర్థిక శాఖ వర్గాలు ఈ సాయంత్రం మీడియాకు సమాచారం ఇచ్చాయి.  ఈనెల 21వ తేదీన ఆర్థిక శాఖ అధికారులు రాజస్థాన్,  బీహార్,  ఢిల్లీ, గుజరాత్ మహారాష్ట్ర,  మధ్యప్రదేశ్ లతోపాటు,  కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ సెల్ ఫోన్ తయారీ కర్మాగారాలు పై  దాడులు చేసింది. విదేశీ నియంత్రణలో ఉన్న్ కొన్ని మొబైల్ కంపెనీలు అక్రమాలకు పాల్పడినట్లు ఐ టీ శాఖకు సమాచారం అందింది. దీంతో విదేశీ నియంత్రణలో ఉన్న సెల్ఫోన్ ఫ్యాక్టరీలపై ఆర్థిక శాఖ అధికారులు దాడులు చేశారు ఈ క్రమంలో వారికి విస్తుపోయే సమాచారం అందింది . దాదాపు 7 వేల కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధీంచిన వివరాలను,  ఆయా కంపెనీలు ఐటీశాఖ  సమర్పించ లేదని తెలిసింది. ఆర్థిక శాఖకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విదేశాల్లో ఉన్న తమ కంపెనీలకు 5500 కోట్ల రూపాయలకు పైగా చెల్లింపులు చేసినట్లు ఐటీ శాఖ అధికారుల సోదాల్లో తేలింది. చట్టం 1961 నిబంధనలను ఆ కంపెనీలు పాటించలేదని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. మొబైల్ ఫోన్ల తయారీ సంబంధించింది స్పష్టత లేని గణాంకాలు ప్రభుత్వానికి నివేదించిన 2 సెల్ ఫోన్ కంపెనీలపై చర్యలు తీసుకోనున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. చైనాకు చెందన ఒప్పో. షావోమీ కంపెనీల సెల్ ఫోన్ లు అశేష  భారతావనిని ఆకట్టు కున్నాయని చెప్పవచ్చు. ఈ  రెండు కంపెనీ లకు చెందిన వివిధ మోడళ్లు తక్కు వధర, ఎక్కవ ఫ్యూచర్లతో అన్ని వర్గాల వారినీ  ఆకట్టుకున్నయి. ఆదరణ పెరగడంతో ఇవి  అడ్డదారులు తొక్కాయి. ప్రభుత్వం తాజాగా కొరడా ఝుళిపించారు డంతో  ఈ సెల్ ఫోన్  కంపెనీలు బెంబేలెత్తుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: