షాకింగ్ : జడ్జి పైకి చెప్పు విసిరిన ముద్దాయి.. ఎందుకంటే?
ఇకపోతే ఇటీవల కాలంలో ఆడపిల్లలపై అత్యాచారాలు పాల్పడినవారికి అటు కోర్టు సంచలన తీర్పు వెలువరిస్తూ ఉండడం గమనార్హం. ఢిల్లీ నిర్భయ కేసులో నిందితులకు ఉరిశిక్ష పడింది.. హైదరాబాద్ దిశ కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేశారు. ఇటీవలే కొన్ని అత్యాచార కేసులో నిందితులకు ఉరిశిక్ష పడినప్పటికీ హైకోర్టు వెళ్ళటం గమనార్హం. ఇక ఇటీవలే మధ్యప్రదేశ్లో పొక్సో కోర్టు కూడా ఒక అత్యాచారం కేసులో సంచలన తీర్పును వెలువరించింది. అయితే ఈ కేసుకు సంబంధించిన విచారణ జరిగిన తర్వాత జడ్జి తీర్పు వెలువరించారు. అటు వెంటనే నిందితుడు ప్రవర్తించిన తీరు మాత్రం అక్కడ ఉన్న వారందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది.
ఏకంగా తీర్పు చెప్పిన జడ్జి పైకి ముద్దాయి చెప్పు విసరడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. సుచిత్ సాకేత్ అనే యువకుడు గత ఏడాది 5 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు ఆధారాలతో నిందితుడ్ని పొక్సో కోర్టులో హాజరుపరిచారు. ఇక దీనికి సంబంధిత విచారణ ఎన్నో రోజులనుంచి జరుగుతుంది. ఈ క్రమంలోనే ముద్దాయిగా ఉన్న సుజిత్ సాకేత్ మరణించే వరకూ జైల్లోనే ఉంచాలని అటు జడ్జి తీర్పు నిచ్చారు. దీంతో ఆగ్రహానికి గురైన నిందితుడు జడ్జి పైకి చెప్పు విసిరాడు. ఆ చెప్పు ఆయనపై కాకుండా సాక్షుల బోన్ వద్ద పడింది.. దీంతో అందరూ షాక్ అయ్యారు. పోలీసులు వెంటనే అతణ్ని అదుపులోకి తీసుకున్నారు.