సైకో యువతి.. యువకుడు పెళ్లి చేసుకోవడం లేదని ఏం చేసిందంటే?

praveen
అయితే సాధారణంగా యువకులు ప్రేమించిన యువతి దక్కకపోతే ఎవరికీ దక్క కూడదు అనే ఉద్దేశంతో ఎన్నో దారుణాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. ప్రేమించిన యువతిని మోసం చేయడంతో యువకులు దాడి కి పాల్పడుతూ ఉండడం కూడా గమనార్హం. కానీ ఇక్కడ జరిగిన ఘటన మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పటివరకు యువకులు మాత్రమే పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు ఒప్పుకోవడం లేదని దాడికి పాల్పడిన సంఘటనలు చూశాము.. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ఒక యువతి రెచ్చిపోయింది.


 ఓ యువకుడు తనను పెళ్లి చేసుకోవడం లేదు అంటూ ఆవేశం తో ఊగిపోయినా యువతి దారుణంగా వ్యవహరించింది. ఇక ఆ యువతి వ్యవహరించిన తీరు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. బీదర్ జిల్లా లో ఈ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని బసవ కళ్యాణ్ తాలూకా బాగ్ తిప్పర గ్రామంలో భీమారావు అనే వ్యక్తి నివాసముంటున్నాడు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అంతా సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన సుమా అనే యువతితో అతనికి పరిచయం ఏర్పడింది.


 ఇక కొన్ని రోజుల పరిచయం లోనే తనను పెళ్లి చేసుకోవాలి అంటూ సుమ భీమారావు పై ఒత్తిడి తీసుకు రావడం మొదలు పెట్టింది. ఇక సుమ నుండి ఒత్తిడి రోజు రోజుకు ఎక్కువైపోతే ఉండడం తో భీమారావు  తట్టుకోలేక తన తల్లితో కలిసి వేరే ప్రాంతం లోకి వచ్చి నివసిస్తున్నాడు. వివాహం చేసుకోవడానికి ఒప్పుకోకపోవడం తో చేబదులు ఇచ్చిన నాలుగు లక్షలు  తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసింది సుమ. కొన్ని రోజుల తర్వాత తిరిగి ఇస్తాను అంటూ చెప్పాడు భీమారావు. కానీ సుమ మనుషులను పురమాయించి భీమారావు ఇంటిని ఆటోను తగల పెట్టింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: