పుష్ప సీన్ రిపీట్.. కానీ ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు?

praveen
ఇటీవలి కాలంలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఎక్కడికక్కడ అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నప్పటికీ పోలీసుల కళ్లుగప్పి ఏదో ఒక విధంగా నిషేధిత వస్తువులను అక్రమ రవాణా చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఏపీలో ఇలాంటివి ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయాయని చెప్పాలి. అక్రమార్కులు వినూత్నంగా ఆలోచిస్తున్నా తీరు అటు పోలీసులకు సవాల్ విసురుతుంది. ఇటీవలి కాలంలో అయితే కొంత మంది అక్రమార్కులు ఏకంగా సినిమాల రేంజ్ లో ప్లాన్ చేస్తూ ఉండడం గమనార్హం. ఇటీవలే అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమా విడుదల అయింది అన్న విషయం తెలిసిందే.


 ఈ సినిమాలో చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ పాత్రలో నటించాడు అల్లు అర్జున్. అయితే పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఎన్నో చిత్రవిచిత్రమైన ప్లాన్స్ వేస్తూ ఉంటాడు అల్లు అర్జున్. అచ్చం ఇలాగే ప్రస్తుతం.పుష్ప సినిమా సీన్ రిపీట్ చేశాడు ఇక్కడ కొంత మంది అక్రమార్కులు. దీంతో పోలీసులు సైతం షాకవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కర్నూలు జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిషేధిత గుట్కా ప్యాకెట్లను నాటుసారాను అక్రమంగా తరలిస్తూ పోలీసులకు చిక్కాడు ఇక్కడ  అక్రమార్కులు.


 ఈ క్రమంలోనే అచ్చం పుష్ప సినిమాలో ఒక సన్నివేశం తరహాలోనే ఇక్కడ కేటుగాడు ప్లాన్ చేశాడు అని చెప్పాలి. పుష్ప సినిమాలో పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు ఏకంగా నూనె డ్రమ్ములు కింద ఒక అర ఏర్పాటు చేస్తారు. అచ్చంగా ఇలాగే చేసాడు ఇక్కడ ఒక కేటుగాడు  డీసీఎం వ్యాన్లో నూనె డ్రమ్ములు పెట్టాడు.   ఇక వాటి కింద ఒక అర ఏర్పాటు చేసి అందులో నిషేధిత గుట్కా ప్యాకెట్లను నాటుసారాను పెట్టి అక్రమ రవాణా చేయాలి  అని అనుకున్నాడు. కర్ణాటక నుండి ప్రకాశం జిల్లా అర్ధవీడు అక్రమంగా  తరలించాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే మధ్యలో పోలీసులు తనిఖీలు చేశారు. నూనె డ్రమ్ములు పక్కకు జరిపి అర ఓపెన్ చేసి చూడగా 14 లక్షల విలువచేసే నిషేధిత గుట్కా ప్యాకెట్లు 15 లీటర్ల నాటుసారా కూడా పట్టుబడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: