తెలియని వ్యక్తి తో డేటింగ్ కి సిద్ధమైన యువతి.. కానీ అంతలోనే ట్విస్ట్?
కానీ ఇప్పుడు మాత్రం తెలియని వ్యక్తులతో ఏకంగా డేటింగ్ చేయడానికి కూడా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. పరిచయం లేని వారితో డేటింగ్ కేవలం పాశ్చాత్య దేశాలు ఒక సంస్కృతి గా కొనసాగుతోంది. ప్రస్తుతం మన దేశంలో కూడా ఎంతో మంది ఇలాంటివి చేస్తున్నారు.. ఇటీవల అమెరికాలో ఓ యువతి ఇలాంటివి ట్రై చేసి చివరికి ఒక చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. అమెరికాలోని షైనాకు చెందిన కార్ట్ వెల్ అనే మహిళ ఒక కంపెనీ లో మేనేజర్ గా పని చేస్తుంది. వీకెండ్లో డేటింగ్ కి వెళ్ళాలి అనుకుంది సదరు మహిళ.
డేటింగ్ చేయడానికి ఒక పార్ట్ నర్ ను వెతుక్కుంది. హింగే అనే వ్యక్తిని ఆన్లైన్ ద్వారా కలుసుకుని ఇద్దరు డేటింగ్ ద్వారా ఒకరి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఇక డేటింగ్ చేయడానికి కూడా ఓకే అనుకున్నారు. అయితే తాను డేటింగ్ వెళ్లాలి అనుకున్న వ్యక్తి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని భావించింది సదరు మహిళ. అతని గురించి గూగుల్లో సెర్చ్ చేసి ఒక్క సారిగా షాక్ అయింది. ఏకంగా అతని గురించిన వివరాలు చూసి ఆమె గుండె ఆగిపోయినంత పని అయిపోయింది ఇంతకీ ఏం జరిగిందంటే కార్ట్ వెల్ డేటింగ్ కు వెళ్లాలి అనుకున్న వ్యక్తి కిడ్నాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దీంతో భయపడిపోయిన సదరు మహిళ హింగేతో డేటింగ్ క్యాన్సల్ చేసుకుందట.