తల్లి గర్భం, సమాధి.. ఇక్కడే ఆడపిల్లకు రక్షణ?
ఎప్పుడు ఎటువైపు నుంచి కామపు కోరలు దాడి చేస్తాయో అని అనుక్షణం భయపడుతూ బతకాల్సిన దుస్థితి ప్రస్తుతం సమాజంలో ఆడపిల్లకు ఎదురైంది అని చెప్పాలి. చదువు ఉద్యోగం వ్యాపారం ఎక్కడికి వెళ్లిన మహిళపై లైంగిక వేధింపులు మాత్రం ఆగడం లేదు. ఆడపిల్ల కనిపిస్తే చాలు రెచ్చిపోతున్న కామాంధులు పంజా విసురుతు ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తున్నారు. కొంతమంది అత్యాచారాలు చేయడమే కాదు దారుణంగా హత్యలకు పాల్పడుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయ్. అయితే ఇలా మానసిక వేధింపులకు గురైన ఒక బాలిక తన బాధను ఎవరికీ చెప్పుకోలేక తనలో తానే కుమిలిపోయి తనువు చాలించింది.
అయితే ప్రాణాలు వదిలే ముందు ఆ బాలిక రాసిన ఒక సూసైడ్ నోట్ కాస్త ప్రస్తుతం అందరి హృదయాలను కదిలిస్తుంది. చెన్నైలోని పూణే మల్లె ప్రాంతానికి చైతన్య బాలిక 11వ తరగతి చదువుతుంది. అయితే కొన్ని రోజుల క్రితం అదృశ్యం కాగా ఇటీవల పోలీసులు గాలింపు చర్యల్లో భాగంగా ఆమె మృతదేహం లభ్యమైంది.మృతదేహం పక్కనే సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ లేఖలో తల్లి గర్భం సమాధి మాత్రమే మహిళకు సురక్షితమైన ప్రదేశాలు అటు ఆ బాలిక రాసింది. కుమార్తె 9వ తరగతి వరకు ప్రైవేట్ పాఠశాలలో చదివగా.. ఆ స్కూల్ లో పనిచేసే ఉపాధ్యాయుడి కుమారుడు తన కుమార్తెను వేధించేవాడని తల్లి పోలీసులకు తెలిపింది. వేధింపుల కారణంగానే ఇప్పుడు మరో పాఠశాలలో చేర్పించాను అంటూ వివరించింది. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.