పెళ్లి చేసుకోవడం లేదని.. షాకిచ్చిన ప్రియురాలు.. ఏం చేసిందంటే?
ఆ తర్వాత కాలంలో పెద్ద చదువులకు వెళుతూ విడిపోయారు. కానీ ఒకానొక సమయంలో రీయూనియన్ నిర్వహించగా వీరిద్దరూ కలిసారూ. ఇక వీరిద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారి పోయింది. ఇద్దరు మంచి ఉద్యోగంలో కొనసాగుతూ ఉండటం తో ఇక వీరి పెళ్లి కి ఎలాంటి అడ్డంకులు ఉండవు అని అనుకున్నారు. కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఇక ఒకరిని వదిలి ఒకరు ఉండలేక సహజీవనం చేయడం మొదలుపెట్టారు. అంతలోనే ఊహించని షాక్ ఇచ్చాడు ప్రియుడు.. ఏకంగా పెళ్లి చేసుకోను అంటూ ముఖం మీద చెప్పడమే కాదు మరో మహిళతో పెళ్లికి కూడా సిద్ధమయ్యాడు. దీంతో షాకింగ్ నిర్ణయం తీసుకున్న సదరు మహిళ ఆత్మహత్య చేసుకుంది.
ఖమ్మం జిల్లాకు చెందిన గౌతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కు చెందిన పవిత్ర బీఫార్మసీ ఒకచోట చదవడంతో వీరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత జాబ్ నిమిత్తం హైదరాబాద్కు చేరుకున్నారు. తర్వాత ఫేస్ బుక్ లో వీరి మధ్య మళ్లీ పరిచయం మొదలైంది.ఇక ఈ సారి ప్రేమగా మారింది పరిచయం. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు కానీ అది కుదరలేదు. దీంతో ఇక ఇంటి నుంచి బయటకు వచ్చి సహజీవనం చేయడం మొదలుపెట్టారు.. సహజీవనం జీవన మొదలు అయ్యి ఏడాది గడుస్తున్నా పెళ్లి మాట మాత్రం తీసుకు రావడం లేదు. ఎన్ని సార్లు ప్రశ్నించిన మాట దాటవేస్తూ వచ్చాడు. దీంతో వీరి మధ్య ఇటీవల గొడవ జరిగింది అన్న కారణంతో చివరికి ఆత్మహత్య చేసుకొని తనువు చాలించింది పవిత్ర. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.