చలాన్ వేశారని.. పోలీసులకే షాక్ ఇచ్చాడు?

praveen
రోడ్డు నిబంధనలు పాటించాలి అంటూ ట్రాఫిక్ పోలీసులు ఎప్పుడూ వాహనదారులకు సూచనలు చేస్తూ ఉంటారు. మరికొన్నిసార్లు అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. అయితే పోలీసులు ఎంతలా చెప్పినప్పటికీ అటు వాహనదారులు మాత్రం రోడ్డు నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు.  అయితే ఒకప్పుడు రోడ్డు నిబంధనలు ఉల్లంఘించి పోలీసులు చాలాన్లు వేయకుండా తప్పించుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడికక్కడ పోలీసులు నిఘా ఏర్పాటు చేస్తూ ఉండడంతో అటు వాహనదారులు రోడ్డు నిబంధనలు ఉల్లంఘిస్తే  తప్పనిసరిగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

 ఆయా ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించకపోయినా.. సీసీ కెమెరా ఫుటేజీ ల ద్వారా   రోడ్డు నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానా విధిస్తూ ఇక ఇంటికే పోస్టు ద్వారా చాలాన్లు పంపిస్తూ ఉన్నారు నేటి రోజుల్లో. ఇలా వాహనదారులు కాస్త రోడ్డు నిబంధనలు ఉల్లంఘించి నిర్లక్ష్యంగా వ్యవహరించారంటే భారిగా జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే కొన్ని కొన్ని సార్లు పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో వాహనదారులు రోడ్డు నిబంధనలు ఉల్లంఘించి పోలీసులకు చిక్కి జరిమానాలు విధించే సమయంలో చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం వంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 ఇక్కడ ఒక వ్యక్తి ఏకంగా పోలీసులు షాక్ అయ్యే విధంగా వ్యవహరించాడు. తరచు ట్రాఫిక్ పోలీసు చలాన్లు వేస్తున్నారు అని కోపంతో ఒక వ్యక్తి ఏకంగా తన బైక్ పెట్రోల్ పోసి నిప్పంటించి తగులబెట్టాడు. ఈ ఘటన తెలంగాణలోని ఆదిలాబాద్ పట్టణం లో వెలుగులోకి వచ్చింది. ఖానాపూర్ కు చెందిన మక్బూల్ అనే వ్యక్తి బైక్పై వెళ్తున్నాడు ఇంతలో ట్రాఫిక్ పోలీసులు ఫోటో తీసి చలన్ వేసారు. దీంతో అసహనానికి గురైన సదరు వ్యక్తి బైక్ దిగి ఇక పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు  మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే బైక్ మొత్తం పూర్తిగా కాలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: