రోజుకో మలుపు తిరుగుతున్న ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు.. ఎందుకు..!

MOHAN BABU
డ్రగ్స్ కేసులో అరెస్టయిన షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్  ఖాన్ కేసులో రోజుకో మలుపు తిరుగుతూ వస్తుంది. ఇప్పటికే కోర్టు మూడు సార్లు బెయిల్ ను తిరస్కరించింది. కాగా ఈ రోజు నాలుగో సారి కోర్ట్ లో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విచారణ జరగనుంది. అయితే ఈసారైనా ఆర్యన్ ఖాన్ కు బెయిల్ వస్తుందా రాదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అటు షారుక్ అభిమానులే కాదు బాలీవుడ్   ఇండస్ట్రీ  మొత్తం ఆర్యన్ ఖాన్ కు బెయిల్ వస్తుందా రాదా అనే విషయంలో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేసులో కొత్త కొత్త ఆరోపణలు, సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కానీ ఆర్యన్ ఖాన్ కి మాత్రం ఈ కేసులో బెయిల్ రావడం లేదు. అక్టోబర్ 2న అధికారులు అరెస్టు చేశారు.అప్పటినుండి ఇప్పటివరకు ఆర్యన్ కు బెయిల్ రాకుండా అడ్డుపడుతున్నారు. నిన్న హైకోర్టులో ఆర్యన్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరపగా ఆ కేసు ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా పడింది. దీంతో ఆర్యన్ ఖాన్ జైలు శిక్షను మరోరోజు పొడిగించింది న్యాయస్థానం. మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి ఆర్యన్ తరఫున వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసులో ఆర్యన్ ను అక్రమంగా అరెస్టు చేశారని తెలిపారు.
 కృయిజ్ షిప్ లో పార్టీకి ఆర్యన్ ఖాన్ నీ ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారని వెల్లడించిన అడ్వకేట్ ప్రతీక్ గావా అనే ఈవెంట్ ఆర్గనైజర్ పిలుపుమేరకు ఆర్యన్ ఖాన్ అక్కడికి వెళ్ళినట్టుగా కోర్టుకు తెలియజేశారు. ఆర్యన్ ఖాన్ తో పాటు అర్బాజ్మర్చంట్ ను కూడా ఆహ్వానించడంతో  ఇద్దరూ కలిసి వెళ్లారని ఆ క్రమంలోనే వారిని నార్కోటిక్ అధికారులు అరెస్ట్ చేశారని బోధించారు ముకుల్.  అర్బాజ్ కు ఆర్యన్ కు ఎలాంటి సంబంధం లేదని, ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు దృష్టికి తీసుకెళ్లారాయన. తనతోపాటు కలిసి వెళ్లిన ఓ వ్యక్తి దగ్గర మాదక ద్రవ్యాలు కనబడితే ఆర్యన్ ఖాన్ ను నార్కోటిక్స్ అధికారులు ఏ విధంగా  అరెస్టు చేస్తారంటూ ముకుల్ రోహత్గి ఎన్సీబీ కి ప్రశ్నలు వేశారు. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ పూర్తిగా అక్రమమని వాదించారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆర్యన్ ఖాన్ పై ఆరోపిస్తున్న వాట్సాప్ చాట్లు ముంబై క్రూయిజ్ పార్టీకి సంబంధించినవి కాదన్నారు. క్రూయిజ్ షిప్ పై దాడి  కేసులో  అరెస్టయిన ఇద్దరు నిందితులకు ఎం డి పిఎస్ ప్రత్యేక కోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. ఎన్సీబి అరెస్టు చేసిన ఇద్దరు నిందితులు మనీష్ రాజగర్య, అడిన్ సాహు లకు బెయిల్ మంజూరైంది. క్రూయిజ్ షిప్ కు అతిథిగా వెళ్లిన రాజగర్య కొద్ది మొత్తంలో హైడ్రోపోనిక్ మాల్టీ స్ట్రైన్ గంజాయి తీసుకోవడం వల్ల అరెస్ట్ అయ్యారు. ఎన్సీబి అధికారుల ప్రకారం వినియోగం ఆరోపణలపై  సాహూ ను అరెస్టు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: