పదహారేళ్లకే ప్రేమ.. చివరికి ఏం జరిగిందంటే?

praveen
ప్రేమ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురానుభూతి.. మనసుకు నచ్చిన వారిని ప్రేమించి ఇక వారిని పెళ్లి చేసుకుని జీవితాంతంఉండాలి అందరూ భావిస్తూ వుంటారు. అయితే నేటి రోజుల్లో ప్రేమ అనేది మాత్రం ఎన్నో దారుణాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ముఖ్యంగా నేటి రోజుల్లో పిల్లలు ప్రేమ పేరుతో పెడదోవ పడుతున్న ఘటనలు రోజురోజుకీ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. చక్కగా చదువుకోవాల్సింది పోయి ప్రేమా దోమా అంటూ చివరికి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఎంతోమంది. కొంతమంది అయితే చిన్న వయసులోనే ప్రేమకోసం క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.

 ఇలా నేటి రోజుల్లో ప్రేమ అనేది ఎన్నో దారుణ ఘటనలకు చిరునామాగా మారిపోయింది అని చెప్పాలి. కానీ తెలిసీ తెలియని వయసులో పుడుతున్న ప్రేమ ఎన్నో అనర్థాలకు కూడా కారణం అవుతుంది. ఇక ఎంతో మంది తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది  నేటి రోజుల్లో ప్రేమ. అయితే నేటి రోజుల్లో తెలిసీ తెలియని వయసులో పుట్టిన ప్రేమ ఎన్ని అనర్థాలకు కారణం అవుతుంది అనే దానికి ఇక్కడ జరిగిన ఘటనే నిదర్శనం గా మారిపోయింది. చదువుకునే వయసులోనే అతనికి ప్రేమ అనే దోమ కుట్టింది. ఈ విషయం తల్లిదండ్రుల వరకూ వెళ్ళింది. అయితే ముందు చదువుపై దృష్టి పెట్టాలని ఆ తర్వాత ప్రేమ గురించి ఆలోచించాలి అంటూ తల్లిదండ్రులు మందలించారు.

 అలా మందలించడమే ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. ప్రేమ వద్దన్నందుకు బాలుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కింగ్ కోటి లోని ఫర్ద గేట్ లో నివాసముండే 16 ఏళ్ల బాలుడు ఇంటర్ చదువుతున్నాడు. ఇక ఇటీవలే ఓ బాలిక తో ప్రేమ వ్యవహారం సాగిస్తున్నాడు.  ఈ విషయం ఇంట్లో తెలిసింది  పలుమార్లు మందలించారు. అయిన అతని తీరులో మాత్రం మార్పు రాలేదు. ఇక ఇటీవల చదువుపై దృష్టి పెట్టాలని తల్లిదండ్రులు మరోసారి మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన బాలుడు రాత్రి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడూ. అయితే ఎంతకీ బయటకి రాకపొయేసరికి అనుమానం వచ్చిన తల్లిదండ్రులు చూడగా ఉరి వేసుకుని ఫ్యాన్కు వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు. తల్లిదండ్రులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: