వామ్మో వీడు మామూలు ముదురు కాదు.. చదువుకోమని పంపిస్తే?

praveen
ఈ మధ్య కాలంలో విద్యార్థులు బాగా చెడిపోతున్నారు. తల్లిదండ్రులు బాగా చదువుకోవాలని పాఠశాలలు కళాశాలలకు పంపిస్తే ఎన్నో దారుణాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఓ విద్యార్థి ఇలాంటిదే చేసాడు. పాట్నాకు చెందిన మహావీర్ అనే విద్యార్థి ఐఐటీ ఖరగ్ పూర్ లో బీటెక్ విద్యనభ్యసిస్తున్నారు. అయితే శ్రద్ధగా చదువుకోకుండా దేశముదురు పనులు చేయడం మొదలు పెట్టాడు. ఢిల్లీలోని ఒక స్కూల్ కు చెందిన 50 మంది విద్యార్థులు టీచర్లను వేధింపులకు గురిచేయడం చేశాడు. యాప్స్ పై తనకున్న పరిజ్ఞానాన్ని వాడుకొని ఫోటోలను మార్పింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం ఎవరూ గుర్తుపట్టకుండా వాయిస్ మార్చుకొని మాట్లాడటం లాంటివి చేసేవాడు.

 ఇక అమ్మాయిలు కాస్త క్లోజ్ అయ్యారు అంటే చాలు వారి ఫోటోలను తీసుకొని వాటిని మార్ఫింగ్ చేసి ఇక ఫేక్ ఇంస్టాగ్రామ్ ఐ డి లు క్రియేట్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చేసేవాడు. ఇలా ఎన్నో ఫోటోలు సోషల్ మీడియాలో తరచూ దర్శనం ఇవ్వడంతో ఆ స్కూల్ యాజమాన్యం అవాక్కయింది. దీంతో ఇక దీనికి చెక్ పెట్టేందుకు పోలీసులను ఆశ్రయించింది స్కూల్ యాజమాన్యం. దీంతో ఇక తీగ లాగితే డొంక కదిలినట్లు గా ఎన్నో వివరాలు బయటకు వచ్చాయి. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు ఎంతో లోతుగా విచారణ మొదలుపెట్టారు. ఇక ఇదంతా చేస్తుంది బీటెక్ విద్యార్థి మహావీర్ అన్న విషయాన్ని గుర్తించారు. కేవలం ఒక స్కూల్ కు చెందిన విద్యార్థులు మాత్రమే కాదు వేరు వేరు స్కూలుకు చెందిన విద్యార్థులను కూడా వేధించినట్లు గుర్తించారు.

 అంతేకాదు ఆన్లైన్ క్లాసులు కోసం క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్ లోకి కూడా ఎలాగోలా చొరబడి విద్యార్థులను వేధింపులకు గురి చేసేవాడట. ఇప్పుడు వరకు ఎన్నో ఫేక్ ఐడి లను క్రియేట్ చేసుకుని దారుణంగా ప్రవర్తించాడు అన్న విషయాన్ని పోలీసులు తేల్చారు  అతని పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక ఈ కేసులో భాగంగా  స్కూల్ విద్యార్థులు టీచర్లతో వారి తల్లిదండ్రులను కూడా విచారించారు  ఇలా ఎన్నో వర్చ్యువల్ నెంబర్లు ఫేక్ ఐడి లను కూడా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి మొబైల్ లో ఎన్నో అసభ్య కరమైన వీడియోలు ఫోటోలు ఉన్నాయని.. అతని లాప్టాప్ కూడా స్వాదినం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: