షాకింగ్ : ఐదు రూపాయల కోసం.. ఇంత దారుణమా?

praveen
ఈ మధ్యకాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే మనుషుల్లో మానవత్వం అనేది పూర్తిగా కనుమరుగై పోతుంది అని అర్థమవుతుంది.  మొన్నటివరకు మనుషులంటే మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ అనే వారు కానీ ఈ మధ్యకాలంలో మనుషులు ప్రవర్తిస్తున్న తీరు చూస్తే మాత్రం అమ్మో మనుషులు మానవత్వానికి కాదు క్రూరత్వానికి కేరాఫ్ అడ్రస్ అన్న విధంగా మారిపోయింది పరిస్థితి.  జాలి దయ మానవత్వం కరుణ లాంటివి మనుషుల్లో అసలు ఎక్కడా కనిపించడం లేదు అంటే నమ్మండి.  అయితే ఇది ఎవరో చెబుతున్నది కాదు ఇక తెరమీదికి వస్తున్న ఘటనలే మనుషుల్లో మానవత్వం కనుమరుగైపోయింది అన్నదానికి నిదర్శనంగా మారిపోతున్నాయి.

 చిన్నచిన్న కారణాలకే ఏకంగా కసాయి వ్యక్తులుగా మారిపోతున్న వారు సాటి మనుషుల విషయంలో దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఏకంగా దారుణంగా దాడి చేయడం లేదంటే ప్రాణాలు తీసేయటం లాంటివి కూడా చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. అతను ఒక హోటల్ కి వెళ్ళాడు. కావలసిన ఆహారం తీసుకున్నాడు. డబ్బులు చెల్లించే సమయంలో ఐదు రూపాయలు తక్కువ పడ్డాయి.  ఐదు రూపాయలు తక్కువగా ఉన్నాయి కాస్త సర్దుకోండి మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తానులే అంటూ చెప్పాడు సదరు వ్యక్తి. కానీ ఐదు రూపాయల తక్కువగా ఉంటే హోటల్ యజమాని మాత్రం ఏకంగా కోపంతో ఊగిపోయాడు.

  కస్టమర్ ని ఎంతో గౌరవించాల్సింది పోయి దారుణంగా దాడికి పాల్పడ్డాడు. కటక్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం ఐదు రూపాయల కోసం హోటల్ యజమాని వినియోగదారులపై తీవ్రంగా దాడి చేయడం మాత్రం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక దీనిపై స్పందించిన పోలీసులు అటు హోటల్ యజమాని తో పాటు కుమారుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కంజూర్ జిల్లా ఘసిపూర్ పట్టణం లక్ష్మీ బజారు ప్రాంతంలోని మధుసూదనా హోటల్ లో జితేంద్ర భోజనం చేశాడు. హోటల్ యజమాని 45 రూపాయల బిల్లు అయిందని జితేంద్రకు తెలిపాడు. అయితే తన దగ్గర 40 రూపాయలు ఉన్నాయని మిగిలిన ఐదు రూపాయలు సాయంత్రం ఇస్తానంటూ జితేంద్ర తెలిపాడు. కానీ హోటల్ యజమాని మాత్రం ఐదు రూపాయల కోసం ఆగ్రహంతో ఊగిపోయాడు. ఏకంగా కస్టమర్  ఫై దాడికి పాల్పడ్డాడు. చివరికి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని కటకటాల వెనక్కి తోశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: