ఆన్లైన్ ఫ్రెండ్ కోసం వెళ్లిన యువతి.. చివరికి ఘోరం?

praveen
నేటి రోజుల్లో సోషల్ మీడియా వాడకం ఎలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ప్రస్తుత సమయంలో సోషల్ మీడియా అనేది ఎన్నో అనర్థాలకు కారణం అవుతుంది.  ఏకంగా సోషల్ మీడియాలో పరిచయం ఒక యువతి జీవితాన్నే నాశనం చేసింది. సోషల్ మీడియాలో పరిచయం  ఆ యువతి జీవితాన్ని రోడ్డు పాలు చేసింది.  సోషల్ మీడియా పరిచయం స్నేహితుడు అనుకునేవాడిని నీచుడిగా మార్చేసింది. ఇటీవలే ఏకంగా సోషల్ మీడియా కారణంగా ఓ యువతి ఏకంగా సామూహిక అత్యాచారానికి గురైన  ఘటన కేరళలో వెలుగులోకి వచ్చింది.

 రెండేళ్ల క్రితం సోషల్ మీడియాలో పరిచయమైన యువకుడు మాయమాటలతో యువతిని నమ్మించాడు. ఈ క్రమంలోనే కలుద్దాం అంటూ పిలిపించాడు.  తర్వాత స్నేహితులతో కలిసి ఆ యువతిపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. దక్షిణ కేరళ లోని కొల్లాం కి చెందిన యువతికి రెండేళ్ల క్రితం ఆన్లైన్లో కోజికోడ్ అనాస్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడగా.. పరిచయం కాస్తా స్నేహంగా మారింది. తరచూ ఫోన్లో మాట్లాడుకోవడం మెసేజ్ లు చేసుకోవడం లాంటివి కూడా చేసుకున్నారు. ఇటీవలే యువతిని తమ ప్రాంతానికి రావాలి యువకుడు కోరాడు. ఇక మూడు వందల కిలోమీటర్ల ప్రయాణం చేసి స్నేహితుడిని కలవడానికి ఎంతో ఆనందంగా వెళ్ళింది యువతి.

 ఈ క్రమంలోనే యువతిని మాయ మాటలతో నమ్మించి ఒక ఫ్లాట్ కి తీసుకెళ్ళాడు. ఇక ఆ ఫ్లాట్ లో అప్పటికే ముగ్గురు యువకులు ఉన్నారు.  ఎవరు అని అడుగగా ప్రాణ స్నేహితులు నీతో పరిచయం చేద్దామని తీసుకొచ్చాను అంటూ మాయమాటలు చెప్పాడు. ఆ తర్వాత నలుగురు యువకులు ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఇక ఈ దృశ్యాలను మొత్తం ఫోన్ లో వీడియోలు ఫొటోలు తీశారు. అంతలోనే యువతి ఆరోగ్యం క్షీణించిందని గ్రహించి ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి అక్కడినుంచి ఉడాయించారు. తర్వాత యువతికి ఫోన్ చేసి ఎవరికైనా విషయం చెబితే సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తమంటూ బెదిరించారు. కానీ యువతిపై అత్యాచారం జరిగిందని గ్రహించిన వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇక హాస్పిటల్ కు చేరుకుని బాధితురాలిని నుంచి స్టేట్ మెంట్ తీసుకున్నారు. ఇక ఆ తర్వాత ఇద్దరు నిందితుడు అరెస్ట్ చేయగా మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: