13 ఏళ్ల బాలిక, ఏడుగురు కామాంధులు.. చివరికి?

praveen
మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ అయిన మనుషులే ఆ మానవత్వాన్ని మరిచి పోతే..  సాటి మనుషులకు సహాయం చేయాల్సిన మనుషులే మానవ మృగాలు గా మారితే..  అమ్మ కడుపులో తొమ్మిది నెలల పాటు ఉండి బయటకు వచ్చిన ఆ మనుషులే చివరికి అదే అమ్మ కడుపు మీద తంతు ఉంటే..  జగతికే మూలమైన  ఆడపిల్లకు అసలు రక్షణ లేకపోతే..  సభ్య సమాజం సిగ్గు పడే పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం నేటి రోజుల్లో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి.  అమ్మ లాంటి అమ్మాయి కి మనశ్శాంతి లేకుండా పోయింది. చెల్లి లాంటి బాలికకు రక్షణ లేకుండా పోయింది.  నేటి రోజుల్లో అడుగడుగునా ఆడపిల్ల కామాంధుల కోరల్లో చిక్కుకుని బలి అవుతూనే ఉంది.


 ఆడ పిల్లల పై అత్యాచారం చేసిన వారిని శిక్షించేందుకు ఎన్నో కఠిన చట్టాలు తీసుకువచ్చాం..  ఆడపిల్లలకు రక్షణ కల్పిస్తాం అంటూ ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నాయ్.  కానీ నేటి రోజుల్లో మాత్రం ఆడ పిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనలకు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ప్రతి రోజూ దేశంలో ఎక్కడో ఓ చోట ఆడపిల్ల కామపు కోరల్లో చిక్కుకొని బలి అవుతూనే ఉంది.  మానవత్వమున్న మనుషులే మానవ మృగాలుగా మారిపోయి కామంతో మీద పడుతుంటే ఈ లోకంలో ఆడపిల్లగా పుట్టడమే శాపమా అని ప్రతి ఆడపిల్ల కుంగిపోతుంది.


 ఈ మధ్యకాలంలో ఆడపిల్లలపై అత్యాచారం ఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. జార్ఖండ్లోని రాంచీలో దారుణ ఘటన వెలుగు చూసింది 13 సంవత్సరాల బాలికపై ఏడుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేసిందని. అయితే అత్యాచారానికి పాల్పడిన వారిలో నలుగురు మైనర్లు ఉండటం గమనార్హం. ఆగస్టు 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్యాచారం చేసిన మైనర్ల లో ఒకరికి ఆ బాలికతో పరిచయం కూడా ఉందట. ఈ క్రమంలోనే మాయ మాటలతో నమ్మించి 13 ఏళ్ల బాలికను ఒక ప్రాంతానికి పిలిచిన బాలుడు.. ఇక తన స్నేహితులతో కలిసి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: