అన్న రాఖీ కట్టుకోలేదని.. చెల్లి షాకింగ్ నిర్ణయం?
ఒకవేళ ఇలా రక్షాబంధన్ రోజు ఇక అక్కాచెల్లెళ్లతో రాఖీ కట్టించుకోకపోతే ఏదో కోల్పోయినట్టు గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక అన్నయ్యకు రాఖీ కట్టకపోతే చెల్లెలు కూడా ఎంతగానో బాధ పడుతూ ఉంటారు. అయితే అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ రోజు అన్న చేసిన పని ఏకంగా చెల్లి ప్రాణాలు పోయేంత వరకు దారి తీసింది. అన్నాచెల్లెళ్ల మధ్య అనురాగం పెంచాల్సిన రాఖీ పండుగ చివరికి కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఆ తల్లిదండ్రులకు కడుపుకోత కు దారి తీసింది.
ఏకంగా అన్న రాఖీ కట్టుకోలేదు అన్న కారణంతో చెల్లి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలోని జహీరాబాద్ పట్టణంలో వెలుగులోకి వచ్చింది. మాణిక్ ప్రభు వీధికి చెందిన మమత ఎంతో సంతోషంగా అన్నకు రాఖీ కట్టడానికి వెళ్ళింది. కానీ అన్న మాత్రం చెల్లి తో ఎంతో సంతోషంగా రాఖీ కట్టించుకోవాల్సింది పోయి.. రాఖీ కట్టుకునేందుకు నిరాకరించాడు. దీంతో మనస్తాపం చెందింది మమత. ఇక రక్షాబంధన్ రోజు అందరికీ అన్నకి రాఖీ కట్టే లేకపోయాను అన్న విషయాన్ని జీర్ణించుకోలేక పోయింది. దీంతో ఇంట్లో ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.