అసలు వీడు మనిషేనా.. డబ్బుల కోసం ఇంత కక్కుర్తా?

praveen
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలు అందరికీ ఉపయోగపడే విధంగా ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా రైతుల కోసం ఎన్నో వినూత్న తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలలో రైతు భీమా పథకం కూడా ఒకటి. ఈ పథకం ద్వారా ఒకవేళ రైతు మరణిస్తే ఏకంగా అతని పేరుమీద 5 లక్షల భీమా ప్రభుత్వం అతని కుటుంబ సభ్యులకు అందజేస్తుంది.  ఇక రైతు మరణించిన సమయంలో వారి కుటుంబ సభ్యులకు రైతు బీమా పేరుతో ఆర్థిక భరోసా ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.  ఈ పథకం  ఎన్నో రైతు కుటుంబాలకు ఎంతగానో మేలు చేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 కానీ అధికారుల చేతివాటం కారణంగా అటు రైతు బీమా డబ్బులు అసలైన అర్హులకు మాత్రం అందడం లేదు. ముఖ్యంగా రైతులు చనిపోతే వారి కుటుంబ సభ్యులు ఇక రైతు బీమా డబ్బుల కోసం ఏకంగా ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇలా రైతు బీమా డబ్బులు చెల్లించేందుకు ఎంతో మంది అధికారులు ఏకంగా భారీగా లంచం కూడా డిమాండ్ చేస్తుండటం ఇటీవలికాలంలో వెలుగులోకి వస్తుంది.  మరికొంత మంది ప్రభుత్వ అధికారులు మరింత నీచంగా ప్రవర్తించి ఇక రైతులకు తెలియకుండానే రైతు బీమా డబ్బులను కాజేస్తున్న ఘటనలు కూడా ఇటీవల తెర మీదికి వస్తున్నాయ్. ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది.



 డబ్బులు కోసం ఆ ప్రభుత్వాధికారి ఎంతో కక్కుర్తిపడి ఏకంగా బతికున్న ఒక రైతుని చచ్చిపోయింది  అంటూ డేట్ సర్టిఫికెట్ కూడా సృష్టించాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. మహిళా రైతు చనిపోయినట్లు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి  రైతు బీమా డబ్బులు ను కాజేశాడు. కుల్కచర్ల మండలం కొత్తపాడు కు చెందిన రైతు చంద్రమ్మా ఇటీవల తనకు రైతుబంధు డబ్బులు రావడం లేదు అంటూ తన కుమారుడితో కలిసి అధికారులను ఆశ్రయించింది. ఈ క్రమంలోనే రైతు బీమా సమన్వయకర్త రాఘవేందర్ రెడ్డి ఆ మహిళపై ఫేక్ డెత్ సర్టిఫికెట్ సృష్టించి  రైతు బీమా డబ్బులు కాచేసినట్లు విచారణలో తేలింది. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: