దుబాయ్ నుండి వచ్చిన మహిళ.. కన్నేసిన సూపర్వైజర్.. చివరికి?

praveen
ఇటీవలి కాలంలో మహిళలకు అడుగడుగునా రక్షణ కరువవుతోంది. ఒకవైపు కామంతో కళ్లు మూసుకుపోతున్న మృగాలు ఆడపిల్ల కనిపిస్తే చాలు అత్యాచారాలకు పాల్పడుతున్నారు మరికొంతమంది ప్రేమ అంటూ మాయమాటలు చెప్పి తమ అవసరాలు తీర్చుకుని రోడ్డున పడేసిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మహిళ సభ్య సమాజంలో అడుగడుగునా  ప్రశ్నార్ధక జీవితాన్ని గడపవలసిన పరిస్థితి ఏర్పడింది నేటి రోజుల్లో.  ఇటీవలి కాలంలో ఇలా మహిళలను మాయ మాటలతో నమ్మించి మోసానికి పాల్పడుతున్న సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి.  ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది ఇక్కడ.

 అతనికి అప్పటికే పెళ్లయింది. కానీ మహిళను మోసం చేయాలి అనే ఉద్దేశంతో పెళ్లి అయిన విషయాన్ని దాచి పెట్టాడు  ఈ క్రమంలోనే మాయమాటలతో మహిళతో పరిచయం పెంచుకున్నాడు. నమ్మకస్తుడిగా ఉంటూ పెళ్లి ప్రస్తావన ఆ మహిళ వద్దకు తీసుకు వచ్చాడు  ఇక మహిళతో చనువుగా ఉంటున్నట్లు నటిస్తూనే ఆమె దగ్గర ఉన్న డబ్బులు కాచేస్తూ వచ్చాడు.  చివరికి మోసపోయానని గ్రహించిన మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా సీతానగరం లో చోటుచేసుకుంది. సీతానగరం గ్రామానికి చెందిన 40 ఏళ్ల మహిళ దుబాయిలో ఐదేళ్ల పాటు పనిచేసీ 10కాసుల బంగారం 8 లక్షల నగదుతో ఇటీవలే స్వగ్రామానికి వచ్చింది.

 ఇక ఇన్ని రోజులపాటు దుబాయిలో సంపాదించిన ఆ మహిళ తన దగ్గర ఉన్న డబ్బుతో ఇక్కడే ఏదైనా ఉపాధి చూసుకోవాలి అని అనుకుంది. ఈ క్రమంలోనే ఇటీవల హైదరాబాద్కు వచ్చి ఒక హోమ్ కేర్ లో ఆయాగా చేరింది. అక్కడ సూపర్ వైజర్ గా పని చేస్తున్నాడు సురేష్ కుమార్ అనే వ్యక్తి. అతనికి వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఈ విషయాన్ని దాచి పెట్టి ఆ మహిళతో పరిచయం పెంచుకుని ఇక పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఇక కొన్నాళ్లపాటు నమ్మకస్తుడిగానే ఉన్నాడు. ఆ తర్వాత ఆ మహిళ దగ్గర ఉన్న నగదును క్రమక్రమంగా ఇక దోచుకోవడం మొదలుపెట్టాడు. మహిళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని మొదటి భార్య పేరిట ఇల్లు కూడా నిర్మించాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు నిలదీయడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. అప్పటి నుంచి ఇక మహిళను చిత్రహింసలకు గురి చేస్తూ వచ్చాడు. వేధింపులు తట్టుకోలేక పోయిన మహిళా పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: