మనుషులా.. మృగాలా.. ఇంతకంటే దారుణం ఉంటుందా?
ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మానవ మృగం బారినపడి ఓ పసిపాప బలైపోయింది. ఈ లోకంలోకి వచ్చి నెల రోజులు కూడా గడవకముందే ఆ చిన్నారి తల్లికి నిండు నూరేళ్ళు నిండిపోయాయి. తొట్టెలలో ఆడుకోవాల్సిన ఆ చిన్నారి.. కుళ్లు కుతంత్రాలతో కూడిన మనుషుల మధ్య నీటి తొట్టిలో చివరికి విగతజీవిగా మారిపోయింది. కనీసం పాకడం కూడా రాని ఆ చిన్నారి నీటి తొట్టిలో శవమై తేలింది. ఈ అమానుష ఘటన సమాజాన్ని తలదించుకునేలా చేసింది. సభ్యసమాజం తీరుకు నిదర్శనంగా నిలిచిన ఈ దారుణమైన ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది.
రంగనాయకులపేట లోనే యాదవ వీధిలో పదిహేను రోజుల పసికందును గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత కర్కశంగా చంపేశారు. మానవత్వాన్ని మరిచి ఎంతో ముద్దుగా ఎత్తుక్కోవాల్సిన ఆ చిన్నారిని నిర్దయగా నీళ్లల్లో పడేసి అంతం చేశారు. దీంతో ఇక వెచ్చటి తన ఒడిలో పాలు తాగాల్సిన బిడ్డ ఇక నీటి తొట్టిలో శవమై తేలడంతో ఆ తల్లి రోదన మిన్నంటింది. అయితే పక్కింట్లో అమ్మమ్మా వరుసయ్యే మహిళ ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటుందని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలోనే బిడ్డ పుట్టింది అని ఆనందపడిన ఆ తల్లిదండ్రులు సంతోషం ఎక్కువ రోజులు మిగలలేదు. గుండెలు పగిలేలా ఆ చిన్న చేతులను పట్టుకుని తల్లితండ్రులు ఏడుస్తున్న తీరు అందరిని కంటతడి పెట్టించింది.