పాపం భార్య బాధితుడు.. వేధింపులు తట్టుకోలేక?
కానీ భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటనలు అటు సినిమాల్లో వెలుగులోకి వస్థాయి. నిజ జీవితంలో చాలా తక్కువగానే ఉంటాయి. కానీ ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భార్య ఎంతో సంతోషంగా చూసుకుంటుంది అనుకుంటే పెళ్ళయిన కొన్ని రోజులనుంచే వేధింపులకు పాల్పడటం మొదలు పెట్టింది. ఇక రోజు రోజుకు భార్య వేధింపులు ఎక్కువ అవుతూ వచ్చాయి. చివరికి భార్య వేధింపుల అంటే చావే బెటర్ అనుకున్నాడు ఆ భర్త. ఇక కఠిన నిర్ణయం తీసుకున్నాడు. దీంతో భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు ఇక్కడ ఒక వ్యక్తి. ఈ ఘటన కరీంనగర్లోని సైదాపూర్ మండలం లో వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. సైదాపూర్ మండలం లో ప్రకాష్ ఆమని అనే దంపతులు నివసిస్తున్నారు. అయితే ఈ భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఇక భార్య సూటిపోటి మాటలతో భార్యను తిడుతూ ఉండేది. ఇక భార్య తీరుతో భర్త ఎంతో మనో వేదనకు గురయ్యాడు. ఇక రోజురోజుకు భార్య వేధింపులు ఎక్కువ అవ్వడం తో మనస్థాపం చెంది ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తన కుమారుడితో భార్య తరచు గొడవ పడేదని.. తన కొడుకు మృతికి కోడలి కారణమంటూ మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.