ప్రేమ అనేది ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది..ప్రేమ గురించి ఇంట్లో చెప్పకుండా అడ్డదారులు తొక్కడం అలవాటు చేసుకున్నారు.తల్లి దండ్రులకు చెప్పే దైర్యం లేకుండా బుక్కవుతున్నారు. ఇక్కడ ఓ యువతి పెద్దలు కుదిర్చిన పెళ్లిని చెడగొట్టే ప్రయత్నం లో అదిరిపోయే ప్లాన్ చేసింది. ఆ యువతి తన కాబోయే భర్తతో కలిసి బైక్ పై వెళ్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తి వారిపై దాడి చేశాడు. పెప్పర్ స్ప్రే చల్లి ఉంగరం, డబ్బులు తీసుకెళ్లిపోయాడు. దీనిపై యువతి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అయితే, కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా సుడుంపల్లికి చెందిన ఎంఈవో కుమారుడు వెంకటసాయి కుమార్ తో రాయచోటికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడి కుమార్తెకు పెళ్లి నిశ్చయమైంది.అంతేకాదు వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా అయ్యింది.వెంకసాయి కుమార్, యువతి కలిసి బైక్ పై వెళ్తుండగా ఓ వ్యక్తి వారిపై దాడి చేశాడు.
వెంకటసాయి కుమార్ వద్ద ఉంగరం, డబ్బులు ఎత్తుకెళ్లడమే కాకుండా.. అతడ్ని కొట్టాడు. దీంతో యువతి గుర్తుతెలియని వ్యక్తి వచ్చి తనకు కాబోయే భర్తపై దాడి చేశాడని సుడుంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.అలాగే తనకు కాబోయే అత్తకు, తనకు ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి పెళ్లి చెడగొట్టేల మాట్లాడుతున్నారని కూడా తెలిపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిఘా పెట్టారు..
పోలీసుల స్టైల్ లో విచారణ జరపగా అసలు నిజం బయటకు వచ్చింది.యువతి ఆడిన నాటకంతో షాక్ తినడం కాబోయే భర్త వంతైంది. అటు యువతి తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రేమ విషయం ఇంట్లో చెప్పకుండా నిశ్చితార్థం వరకు వెళ్లిన తమ కుమార్తె.. ఇలాంటి పనిచేస్తుందనుకోలేదని తల్లిదండ్రులు చెప్తున్నారు. యువతిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు..పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..