ఆరోగ్యకరమైన అటుకుల ఇడ్లీ ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి....
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. ఇడ్లీ ఆరోగ్యానికి ఎంత మంచివో అందరికి తెలిసిందే. ఇడ్లీలో మంచి ఆరోగ్యానికి సంబంధించిన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఉదయం పూట ఇడ్లీ తింటే చాలా మంచిది.ఇడ్లి ఆయిల్ తో చేయని పదార్ధం కాబట్టి ఇది తిన్న కాని అధిక బరువు పెరిగే ఛాన్స్ అయితే ఉండదు. ఇక ఇడ్లీ చాలా విధాలుగా చెయ్యొచ్చు. మినపప్పు, ఇడ్లీరవ్వ కలిపి ఇడ్లీ చేస్తారు... కానీ బియ్యంరవ్వ, అటుకులతో కూడా ఇడ్లీ చేసుకోవచ్చు తెలుసా.ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా చిన్న పిల్లలు ఈ అటుకుల ఇడ్లీని తినటం అలవాటు చేసుకుంటే చాలా ఆరోగ్యంగా ఇంకా ఎంతో బలంగా పుష్టిగా అవుతారు.
అటుకుల ఇడ్లీ తయారు చెయ్యడానికి కావాల్సిన పదార్ధాలు......
బియ్యపురవ్వ - ఒకటిన్నర కప్పు,
అటుకులు - ఒక కప్పు,
పుల్లిన పెరుగు - ఒక కప్పు,
బేకింగ్ సోడా - చిటికెడు,
ఉప్పు - తగినంత
అటుకుల ఇడ్లీ తయారుచేసే విధానం:
ముందుగా అటుకుల్ని పుల్లని పెరుగులో వేసి నానబెట్టాలి. అవి బాగా నానాక మెత్తగా చేయాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో బియ్యపు రవ్వని వేయాలి. ఓ పదినిమిషాలు అలా వదిలేయాలి. రవ్వ మిశ్రమంలో ఉన్న నీటిని పీల్చేసుకుని గట్టి పడుతుంది. అప్పుడు కాస్త నీళ్లు వేసి కలపాలి. కాస్త ఉప్పు వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని ఇడ్లీప్లేటులో వేసు కోవాలి. కాస్త నూనె లేదా నెయ్యి రాసుకుంటే ఇడ్లీలు అడుగంటకుండా వస్తాయి. ఇడ్లీ పాత్రని స్టవ్ మీద పెట్టి పదిహేను నిమిషాల పాటూ ఉడికించి దించేయాలి. దించే ముందు వేలితో నొక్కి ఇడ్లీలు ఉడికాయో లేదో చూడాలి. ఇడ్లీలు స్పాంజిలా మృదువుగా వస్తాయి. కొబ్బరి చట్నీతో వీటిని తింటే భలే టేస్టీగా ఉంటుంది.ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన ఇంకా ఆరోగ్యకరమైన వంటకాల కోసం హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి....