వంటా వార్పు: టేస్టీ టేస్టీ `శనగల వడలు` మీ కోసం!!
కావాల్సిన పదార్థాలు:
నానబెట్టిన శనగలు - ఒక కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
జీలకర్ర - అర టీ స్పూన్
ఉల్లిపాయ ముక్కలు - ఒక కప్పు
పచ్చిమిర్చి - నాలుగు
క్యాప్సికమ్ ముక్కలు - అర కప్పు
కొత్తిమీర తురుము - అర కప్పు
పుదీనా తురుము - పావు కప్పు
నూనె - సరిపడా
తయారీ విధానం:
ముందుగా నీటిలో శనగలను నానబెట్టాలి. తర్వాత రోజు ఉదయం నీరంతా వంపేసి శనగలు తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని.. అందులో శనగలు, పచ్చిమిర్చి, ఉప్పు, క్యాప్సికమ్ తరుగు అన్నింటినీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
అనంతరం ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులో ఉల్లితరుగు, జీలకర్ర, కొత్తిమీర తురుము, పుదీనా తురుము వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టౌ మీద పాన్ ఉంచి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి కాగనివ్వాలి.
నూనె కాగాక ముందుగా తయారు చేసుకున్న పిండి మిశ్రమాన్ని చిన్నచిన్న వడలుగా ఒత్తుకుని నూనెలో వేయాలి. వడలు గోధుమరంగు వచ్చే వరకు వేయించి.. ఆ తర్వాత వాటిని టిష్యూ పేపర్ మీదకు తీయాలి.
అంతే టేస్టీ టేస్టీ శనగల వడలు రెడీ అయినట్లే. సాయంత్రం వేళ వీటిని వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి. కాబట్టి, మీరు కూడా ఈ శనగల వడలు తయారు చేసుకుని ఎంజాయ్ చేయండి.