ప్రియుడిని నమ్మింది.. వీడియో లీక్..

Satvika
పాలు విరిగిపోవడానికి చిన్న ఉప్పు కళ్ళు వుంటే చాలు .. అలాగే పచ్చని సంసారాలు నాశనం అవ్వడానికి చిన్న అక్రమ సంబంధాలు కారణం. వాటి కారణంగా ఎంతో మంది ప్రాణాలును పోగొట్టుకున్నారు.. ఈ మధ్య ఇలాంటి ఘటనలు మరింత ఎక్కువగా వినిపిస్తున్నాయి.. భర్త దగ్గర పొందలెని సుఖం వేరే వ్యక్తి తో కోరుకుంటున్నారు. ఆ క్రమంలో అందరినీ వదిలి పెట్టి అతనితో వేరే కాపురం పెడుతూన్నారు.. ఇప్పుడు మరో ఘటన అందరినీ ఆలోచనలో పడేస్తుంది.

భర్తను వదిలేసి ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి కాపురం చేయడం మొదలు పెట్టింది. ఆ క్రమంలో పెళ్ళి చేసుకోవాలని ఆమె కోరింది. దాంతో అతను వీడియోలు చూపించి బెదిరించాడు. ఈ ఘటన కేరళ రాష్ట్రం తిరువనంతపురం జిల్లా వెల్లరాడలో నివాసముంటున్న ఫెర్లిన్ ఫిలిప్, గోపికలకు ఐదేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి మూడేళ్ళ కుమారుడు ఉన్నాడు. భర్త ఎప్పుడూ పనుల నిమిత్తం బయటకు వెళ్ళేవాడు. ఒకసారి బయటకు వెళితే మూడురోజుల పాటు వచ్చేవాడు కాదు..

ఆ సమయాన్ని ఆమె బోర్ గా ఫీల్ అయ్యింది. స్థానికంగా ఉంటున్న ఆటో డ్రైవర్ పరిచమయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. తాను ప్రేమిస్తున్నానంటూ వివాహిత వెంట పడ్డాడు. ఐదునెలల నుంచి విష్ణు వెంటపడుతూనే వున్నాడు.. ఫస్ట్ లో ఆమె దూరం పెట్టినా తర్వాత అథన్ని నమ్మింది. అలా ఇద్దరూ శారీరకంగా కలిశారు.పెళ్ళి చేసుకుని వేరే ప్రాంతానికి తీసుకెళ్ళమని చెప్పింది. తన కొడుకుని భర్త దగ్గరే వదిలి వచ్చేస్తానని కూడా చెప్పింది. విష్ణు కేవలం శారీరక సుఖం కోసం మాత్రమే తనను వాడుకున్నాడని ఆ తరువాత తెలుసుకుంది. పెళ్ళి చేసుకునే ప్రసక్తే లేదు. నేను వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకుంటానన్నాడు. అంతేకాదు ఆమెతో కలిసి ఉన్న వీడియోలను తన భర్తకు పంపించాడు.అది తెలుసుకున్న ఆమె ఆత్మహత్య చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: