రైల్వే ప్రయాణికులకు తాజా శుభవార్త ఇదే!

Suma Kallamadi
ఇండియన్ రైల్వే వ్యవస్థ గురించి అందరికి తెలిసిందే. భారతీయ రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత రద్దీ కలిగిన వ్యవస్థగా పేరు తెచ్చుకుంది. అంటే దాదాపు ఇండియన్ ఎకానమీ వ్యవస్థ రైల్వే పైనే ఆధారపడి ఉందని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ఉద్యోగులు మన ఇండియన్ రైల్వే వ్యవస్థలోనే పనిచేస్తున్నారు. ఇండియన్ రైల్వే మార్గం సుమారుగా 1,14500 కిలోమీటర్లు మేర విస్తరించి ఉన్నది. అయితే ఇది ఒకప్పటి గణాంకం. ప్రస్తుత లెక్కల ప్రకారం మన భారతీయ రైల్వే మార్గం దాదాపుగా 2,24,700 మేర విస్తరించి ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.
అయితే నేటి డిజిటల్ యుగంలో ప్రతి ప్రయాణికుడు టికెట్లు కొనుగోలు కోసం డిజిటల్ విధానంలోనే చెల్లింపు చేసుకునే వెసులుబాటు మన భారతీయ రైల్వే వ్యవస్థ కల్పిస్తోందని సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రైల్వే వారు ప్రయాణికులకు తాజాగా ఒక శుభవార్తను అందించారు. విషయం ఏమిటంటే... రైల్వే స్టేషన్ కి వెళ్ళేటప్పుడు ప్రయాణికులు గంటల తరబడి క్యూలో నిలబడకుండా తేలికగా టికెట్స్ డిజిటల్ రూపంలో కొనుగోలు చేసేందుకు వీలుగా క్యూఆర్ కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని ద్వారా ప్రయాణికులు డిజిటల్ చెల్లింపులు చేయవచ్చును. ఈ విధానాన్ని మొదటగా పశ్చిమ రైల్వే జోన్.. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్, భావ్‌నగర్ డివిజన్‌లలోని అన్ని స్టేషన్లలో QR కోడ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇక త్వరలో ఈ విధానం దేశంలోనే అన్ని జోన్స్ లోకి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని సంబంధిత రైల్వే డివిజన్ మేనేజర్ అశ్విని కుమార్, రమేష్ కుమార్ తెలియజేశారు. ఇప్పటికే పలు రైల్వే డివిజన్లో ప్రయాణికులు డిజిటల్ చెల్లింపులు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే చాలా చోట్ల మొబైల్ యాప్, ఏటీవిఎం, పిఓఎస్, యూపీఐ పలు విధానాలు ద్వారా చెల్లింపులు చేయడం జరుగుతుంది. అయితే ఈ విధానాన్ని ఇంకా విస్తరించాలనే ధ్యేయంతో ఇండియన్ రైల్వే వ్యవస్థ తాజా ప్రకటన చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: