మార్కెట్ అవసరాలకు అనుగుణంగా బిజినెస్ చేస్తే నష్టాలు ఉండవు. అలాంటి బిజిసెస్ ఐడియాల్లో ఒకదాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ప్రస్తుతం మార్కెట్లో కార్ల అమ్మకాలు బాగా పెరిగాయి. మధ్య తరగతి కుటుంబాలు కూడా కార్లను కొనుగోలు చేస్తున్నాయి. అందువల్ల కార్ వాషింగ్ సెంటర్లకు డిమాండ్ పెరిగింది. కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామాల్లో కూడా కార్ల వినియోగం పెరిగింది. దీంతో చాలా చోట్ల కార్ వాషింగ్ సెంటర్స్ వెలుస్తున్నాయి. కార్ వాషింగ్ సెంటర్ బిజినెస్ ద్వారా మంచి లాభాలను పొందవచ్చు.ఇక కార్ వాషింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది.? ఎలాంటి లాభాలు ఉంటాయి.? అందుకు సంబంధించిన పూర్తి వివరాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కార్ వాషింగ్ సెంటర్ పెట్టడానికి కనీసం రెండు కార్లను పార్క్ చేసేందుకు వీలు ఉండేలా ప్లేస్ ఉండాలి. అలాగే కార్ వాషింగ్ కోసం ఒక ప్రొఫెషనల్ మిషన్ ఖచ్చితంగా అవసరపడుతుంది.
దీని ధర రూ. 12 వేల నుంచి రూ. లక్ష దాకా ఉంటుంది. ఇక 2 హార్స్ పవర్ మిషన్ ధర రూ. 14 వేలు ఉంటుంది. ఈ మిషన్‌తో పాటు 30 లీటర్ల వ్యాక్యూమ్ క్లీనర్ కూడా అవసరపడుతుంది. దీని ధర సుమారు రూ. 9 నుంచి రూ. 10 వేల దాకా ఉంటుంది. ఇంకా అలాగే షాంపూ, గ్లోవ్స్, టైర్ పాలిష్‌తో పాటు 5 లీటర్ల డ్యాష్‌బోర్డ్ పాలసీతో సహా వాషింగ్ సామాగ్రి అవసరపడుతుంది.వీటన్నిటికీ కూడా రూ. 1500 నుంచి రూ. 2000 వరకు ఖర్చవుతుంది. కార్ వాషింగ్ సెంటర్ రెడీ చేయడానికి స్థలం కాకుండా కనీసం రూ. 40 వేల నుంచి రూ. 50 వేల వరకు అవసరపడుతుంది. ఇక లాభాలు విషయానికొస్తే.. కారు వాషింగ్ ఛార్జీలు ప్లేస్ బట్టి మారుతుంది. సాధారణంగా చిన్న నగరాల్లో కారు వాషింగ్‌కు రూ. 150 నుంచి రూ. 500 దాకా ఉంటుంది. అదే పెద్ద నగరాల్లో అయితే రూ. 250 నుంచి రూ. 800 దాకా వసూలు చేయొచ్చు.ఇంకా అలాగే ఎస్‌యూవీ కార్ల విషయానికొస్తే రూ. 1000 దాకా కూడా ఆర్జించవచ్చు. కారు వాషింగ్ ద్వారా రోజుకు 8 నుంచి 10 కార్లను క్లీన్ చేసినా, నెలకు సరాసరి రూ. 80 వేల దాకా ఈజీగా సంపాదించవచ్చు.