లులూకి హైదరాబాద్‌ జనం షాక్ ఇచ్చేశారు?

Chakravarthi Kalyan
భవిష్యత్తులో చిల్లర కొట్టులు పెట్టినా కూడా పెట్టుబడులు పెట్టామని చెప్పుకుంటారేమో కొంతమంది రాజకీయ నాయకులు. ఆంధ్రప్రదేశ్ లో ని వైజాగ్ లో లులూ మార్కెట్ పెట్టుబడి పెట్టేందుకు అనుమతులు తీసుకుని డబ్బులు చెల్లించలేదని జగన్ సర్కారు అనుమతి నిరాకరించింది. అయితే చంద్రబాబు హయాంలో షాపింగ్ మాల్ పెట్టేందుకు వచ్చినా కూడా ఏదో పెద్ద ఎత్తున పెట్టుబడి పెడుతున్నారని ప్రచారం చేస్తూ ముందుకు సాగారు.

చాలా ఉద్యోగాలు వస్తాయని ప్రచారం చేసుకున్నారు. కానీ చివరకు లులూ మార్కెట్ సంస్థ వారు పెట్టుబడులకు సంబంధించి అనుమతులు తీసుకోలేదు. దీంతో జగన్ సర్కారు దాన్ని క్యాన్సల్ చేసింది. అయితే దీనిపై టీడీపీ నాయకులు కూడా తీవ్ర విమర్శలు చేశారు. పెట్టుబడులు తీసుకురారు. వచ్చిన సంస్థల అనుమతిని క్యాన్సిల్ చేస్తారని వైసీపీపై భగ్గుమన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ మార్కెట్ లు వచ్చినా కూడా అది అభివృద్ధిలో భాగమని చెప్పడం వారికే చెల్లిందని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

అయితే ఇక్కడికి రావాల్సిన సూపర్ మార్కెట్ హైదరాబాద్ కు తరలిపోయిందని అక్కడ కూకట్ పల్లిలో లులూ మార్కెట్ ను ఏర్పాటు చేశారు. లులూ మార్కెట్ సమీపంలో తీవ్రమైన ట్రాఫిక్ ఏర్పడడంతో ట్రాఫిక్ పోలీసులు తల పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తీవ్రమైన ట్రాఫిక్ తో సామాన్య ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. చివరకు ట్రాఫిక్ లో చిక్కుకున్న ఒక డాక్టర్ ఎమర్జెన్సీ ఆపరేషన్ కు వెళ్లాల్సి ఉందని ఇలా ఒక సూపర్ మార్కెట్ ఓపెన్ అయితే ఇలా ట్రాఫిక్ లో చిక్కుకోవడం దురదృష్టకరమని వాపోయారు.

ఏదైనా షాపింగ్ మాల్ లాంటివి కట్టినపుడు సిటీకి దూరంగా నిర్మిస్తారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ముందుగానే సరైన ప్రణాళికతో అనుమతి ఇస్తారు. కానీ కూకట్ పల్లిలో పెట్టిన లులూ మార్కెట్ కారణంగా రహదారిపై తీవ్ర ట్రాఫిక్ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరి దీని నుంచి ఎలాంటి పరిష్కారం చూపుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: