యూరప్‌లో కాశ్మీరీ కుంకుమ పువ్వుకు ఫుల్‌ గిరాకీ?

Chakravarthi Kalyan
కుంకుమ పువ్వు. దీని విలువని బట్టి దీన్ని రెడ్ గోల్డ్ అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ కుంకుమ పువ్వు వెండి కన్నా కూడా ధర ఎక్కువ పలుకుతుందట ఇప్పుడు. ఇది కాశ్మీర్ లోని ఎత్తైన ప్రదేశాల్లో పెరుగుతూ ఉంటుంది. 2019 తర్వాత ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 ఏ రద్దయిన తర్వాత  కాశ్మీర్ లో పరిస్థితులు చక్కబడ్డాయని తెలుస్తుంది. అక్కడ దాల్ లేక్ లో ఇప్పుడు బోట్లు యధావిధిగా నడుస్తున్నాయి. అలాగే అక్కడ సినిమా హాళ్ళు కూడా నడుస్తున్నాయి ఇప్పుడు.

అంతే కాకుండా అక్కడ వ్యాపారాలు కూడా  పుంజుకుంటున్నాయి అని సమాచారం.  ఇప్పుడు ప్రత్యేకించి కుంకుమ పువ్వుకు జి ఐ ట్యాగ్ రావడంతో, కుంకుమ పువ్వుకు సంబంధించిన వ్యాపారం చేసేవారు అక్కడ బాగా సంపాదిస్తున్నారు. శ్రీనగర్ దగ్గరలో పంపా ప్రాంతంలో  కుంకుమ పువ్వు తయారు చేస్తారని తెలుస్తుంది. అక్కడ 20వేల కుటుంబాల వరకు దీని మీదే ఆధారపడి బ్రతుకుతున్నాయట.

జూలై సెప్టెంబర్ మధ్యలో ఈ కుంకుమ పువ్వును సాగు చేస్తారని సమాచారం. లక్షా 50 వేల పువ్వులను కలిపితే ఒక కిలో కుంకుమ పువ్వు తయారవుతుందట. ఈ పువ్వులను కూడా ఏ మిషనరీ ఉపయోగించకుండా చేతితోనే తీస్తారు అని తెలుస్తుంది. 1600 కిలో మీటర్ల ఎత్తులో మాత్రమే ఈ కుంకుమ పువ్వు  పెరుగుతుందని సాధారణ ప్రాంతాల్లో  పెరగదని  అంటున్నారు. 1990 వరకు అక్కడ కుంకుమ పువ్వు పరిశ్రమ ఉండేదని  అంటారు.

కాశ్మీర్ ను  విధ్వంసకర శక్తులు లోబరుచుకున్న తర్వాత ఈ పరిశ్రమ మరుగున పడిపోయిందని అంటారు. ఇప్పుడు పరిస్థితులు మారిన తర్వాత అక్కడ కుంకుమ పువ్వు పంటలు విరివిగా పండుతున్నాయి. 2020నుండి అక్కడ కుంకుమ పువ్వు పరిశ్రమలు కూడా సక్సెస్ ఫుల్ గా నడుస్తున్నాయని తెలుస్తుంది. ఇప్పుడు 10 గ్రాములు 40 డాలర్ల చొప్పున కొంటున్నారు. అమెరికా, కెనడా అలాగే యూరోప్ దేశాల్లో కుంకుమ పువ్వు కు మంచి గిరాకీ ఉందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: