రేపే మార్కెట్ లోకి ఓలా స్కూటర్

Podili Ravindranath
ఓలా... ట్యాక్సీ రంగంలో విశేష అనుభవం ఉన్న ఈ సంస్థ ఇప్పుడు మరో సంస్థను ప్రారంభించనుంది. అదే ఓలా ఎలక్ట్రానిక్ స్కూటర్. భారతీయ వాహన మార్కెట్ లోనే ఓ సంచలనం తీసుకువస్తామని ఓలా సంస్థ ఇప్పటికే ప్రకటించింది. ఓలా తన ఎలక్ట్రిక్ స్కూటర్ ను భారతదేశంలో రేపు విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. అతిపెద్ద ఈవీ సదుపాయాన్ని ఏర్పాటు చేయడం మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదట ఉత్పత్తి చేస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ అని ఇప్పటికే ఓలా సంస్ఖ ప్రకటించింది. ఎలక్ట్రీక్ స్కూటర్ బుకింగ్ లను కేవలం 499 రూపాయలకే చేసుకునేలా ఓలా సంస్థ ప్రకటించి మరో సంచలనానికి తెరలేపింది.
అధునాతన AI.. ఆటో ఇంజిన్ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ స్కూటర్ ను ఓలా తయారు చేసింది. ప్రతి రోజూ 25 వేల ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఒక ఏడాదిలో గరిష్టంగా రెండు లక్షల యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేసి విక్రయించాలని ఓలా సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. వినియోగదారుల అవనసరాలకు అనుగుణంగా ఓలా స్కూటర్ ను మూడు వేరియంట్లలో విడుదల చేస్తోంది. మొదటి వేరియంట్ 2 కిలో వాట్ మోటర్ తో ప్రాథమికంగా తయారుచేశారు. ఇది గంటకు 45 కిలోమీటర్ల గరిష్ట వేగంతో నడుస్తుంది. ఇక సెకండ్ వేరియంట్ ను 4 కిలో వాట్ మోటర్ తో తయారు చేశారు. ఇది గంటకు 70 కిలోమీటర్ల గరిష్ట వేగంతో పరుగులు పెడుతుంది. ఇక టాప్ ఎండ్ వేరియంట్ తో ఉన్నది చివరి వేరియంట్. దీనిని 7 కిలో వాట్ ఎలక్ట్రిక్ మోటర్ తో రూపొందించారు. ఈ వేరియంట్ టాప్ స్పీడ్ 95 కిలోమీటర్లు పర్ అవర్.
ఓలా స్కూటర్ పూర్తిస్థాయిలో రీఛార్జ్ చేసిన తర్వాత 240 కీలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని అంతా భావించినప్పటికీ... మొత్తం ఎలక్ట్రిక్ రేంజ్ 150 కిలోమీటర్లు ప్రయాణిస్తోందని ఓలా సంస్థ ధృవీకరించింది. అయితే ఇది ఫైనల్ కాదని... ఇది పెరిగే అవకాశం కూడా ఉందని తెలిపింది ఓలా. ఎలక్ట్రిక్ స్కూటర్ ను పూర్తిగా పవర్ రీ ఛార్జ్ చేయడానికి రెండున్నర గంటల సమయం పడుతుంది. ఇక హైపర్ ఛార్జింగ్ స్టేషన్, బ్యాటరీలు కేవలం 18 నిమిషాల్లోనే 50 శాతం వరకు ఛార్జ్ చేయగలవు. ఇక ఇంట్లో ఉండే రెగ్యులర్ ప్లగ్ ద్వారా పూర్తిగా రీ ఛార్జ్ కావడానికి ఐదున్నర గంటల సమయం పడుతుంది. పూర్తిగా ఛార్జ్ అయిన వెంటనే... యజమాని మొబైల్ యాప్ లో నోటిఫికేషన్ వస్తుంది.
ఇక స్కూటర్ కు 7 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ ప్లే ఏర్పాటు చేశారు. జీపీఎస్ నావిగేషన్ తో పాటు 4జీ కూడా స్కూటర్ కు కనెక్టివిటీతో వస్తుంది. ఇక డిస్ ప్లేలో యూ ట్యూబ్, కాలింగ్ మొదలైన ఫీచర్ లకు అవకాశం కల్పించారు. ఇక కీ లెస్ ఇగ్నిషన్ తో మొబైల్ కనెక్టవిటీతో స్టార్ట్ అయ్యేలా రూపొందించారు. ఇక ఓలా స్కూటర్ 10 రంగుల్లో వస్తోంది. ఇక ధర విషయంలో కూడా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లక్ష రూపాయల నుంచి లక్షన్నర మధ్య ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చూడాలి మరి... ఎలక్ట్రిక స్కూటర్ విభాగంలో ఓలా ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: