దెబ్బేసిన బ్యాంకింగ్ షేర్లు ...! నేడు నష్టాలలో ముగిసిన స్టాక్ మార్కెట్ ...!

Suma Kallamadi

నేడు దేశీయ మార్కెట్ నష్టాలతో ముగిసింది. రెండు రోజులపాటు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ నేడు నష్టాల బాట పట్టింది. బెంచ్ మార్క్ సూచీలు మంగళవారం నాడు నష్టాల వైపు చూశాయి. మార్కెట్ నేడు మొదట్లో లాభాల వైపు పరుగులు పెట్టగా చివరికి వచ్చేసరికి అదే మార్క్ ను  కొనసాగించలేక పోయాయి. దీనికి ఒకింత కరోణ వైరస్ గురించి WHO జాగ్రత్తలు తెలపడమే. దీనితో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ కాస్త దెబ్బతిందని చెప్పవచ్చు. నేడు మార్కెట్ ఇంట్రాడే లో సెన్సెక్స్ 393 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ కూడా 10050 పాయింట్ల దిగువకు చేరుకుంది. ముఖ్యంగా ఇందులో ఫైనాన్షియల్ బ్యాంకింగ్ రంగాలకు సంబంధించిన అమ్మకాలు ఒత్తిడి వల్ల మార్కెట్ పై ప్రతికూల ప్రభావం పడింది. ఇంకా దాంతో చివరకు బీఎస్ఈ సెన్సెక్స్ 414 పాయింట్లు నష్టపోయి 33,957 పాయింట్ల వద్దకు చేరుకోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 121 పాయింట్లు నష్టంతో 10047 వద్ద మార్కెట్లు ముగిసాయి.

 

 

ఇక నేడు నిఫ్టీ 50 లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ నాలుగు శాతం పైన లాభపడగా సన్ ఫార్మా, ఇండస్ ఇండ్ బ్యాంక్, భారతి ఇన్ఫ్రాటెల్, ఎం అండ్ ఎం షేర్లు లాభాల బాట పడ్డాయి. ఇక అదే సమయంలో ఐసీఐసీఐ బ్యాంక్, గెయిల్, టాటా మోటార్స్, బిపిసిఎల్, విప్రో షేర్లు భారీగా నష్టపోయాయి. ఇందులో ఐసిఐసిఐ బ్యాంక్ ఏకంగా నాలుగు శాతం వరకు నష్ట పోయింది. ఇక అమెరికా డాలర్ తో రూపాయి విలువ పోలిస్తే కాస్త నష్టాల్లో కదలాడుతుంది. మొత్తంగా ఏడు పైసల నష్టంతో 75.61 వద్ద ట్రేడ్ జరుగుతోంది. ఇక అలాగే అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు కొద్దిగా తగ్గాయి. అందులో బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్ కు 1.05 శాతం తగ్గుదలతో 40.36 డాలర్లకు చేరుకుంది. ఇక అలాగే డబ్ల్యూటీఏ ముడి చమురు ధర బ్యారెల్ కు 0.97 శాతం నష్టంతో 37.83 డాలర్లకు చేరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: