4జీ డౌన్‌లోడ్ వేగంలో జియో రికార్డు..!

Vamsi
భారత టెలీకం రంగంలో జియో వచ్చినప్పటి నుంచి ఇతర నెట్ వర్క్ సంస్థలకు నిద్రపట్టకుండా చేస్తున్నారు.  దీంతో తాము కూడా ఆఫర్లమీద ఆఫర్లు ఇస్తూ వస్తున్నారు.  ఇక టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరిలో 4జీ డౌన్‌లోడింగ్ స్పీడ్‌లో జియో అగ్రస్థానంలో నిలవగా, ఎయిర్‌టెల్ రెండో స్థానంతో సరిపెట్టుకుంది.

వొడాఫోన్ మూడు, ఐడియా నాలుగు స్థానాల్లో నిలిచాయి. దీంతో 4జీ డౌన్‌లోడ్ వేగంలో రిలయన్స్ జియో మరోమారు అగ్రస్థానంలో నిలిచింది. ట్రాయ్ మై స్పీడ్ యాప్ ప్రకారం.. రిలయన్స్ జియో 21.3 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ వేగంతో ఫిబ్రవరి నెలలో అగ్రస్థానంలో నిలవగా ఎయిర్‌టెల్ 8.8, వొడాఫోన్ 7.2, ఐడియా సెల్యూలార్ 6.8 ఎంబీపీఎస్ వేగాన్ని నమోదు చేశాయి.

జియో జనవరిలో 19.4 ఎంబీపీఎస్ వేగాన్ని నమోదు చేయగా ఫిబ్రవరిలో మరింత మెరుగైన ప్రదర్శన కనబరిచింది. జనవరిలో ఎయిర్‌టెల్ 9.4 ఎంబీపీఎస్, వొడాఫోన్ 8.9 ఎంబీపీఎస్, ఐడియా 7 ఎంబీపీఎస్ వేగాన్ని నమోదు చేయగా ఫిబ్రవరిలో వాటి వేగం గణనీయంగా పడిపోయింది.

అప్‌లోడ్ వేగంలో ఐడియా 6.9 ఎంబీపీఎస్ వేగంతో అగ్రస్థానం నిలబెట్టుకోగా, 5.5 ఎంబీపీఎస్ వేగంతో వొడాఫోన్, 4.5 ఎంబీపీఎస్ వేగంతో జియో, 3.9 ఎంబీపీఎస్ వేగంతో ఎయిర్‌టెల్ వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: