రైతు భరోసా కోసం రేవంత్ రెడ్డి అప్పులు.. ఏ రేంజ్లో అంటే?
రూ. 1000 కోట్ల చొప్పున బాండ్లను 24, 29, 30 సంవత్సరాల కాలపరిమితితో రిజర్వ్ బ్యాంకు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఆ బాండ్లను ఈ నెల ఏడో తేదీన ఆర్బీఐ వేలం వేయనుంది. వేలం అనంతరం ఆ మొత్తం రాష్ట్ర ఖజానాకు జమ కానుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అప్పుల ద్వారా 40,909 కోట్లు సమీకరించుకుంది. తాజా రుణంతో ఆ మొత్తం 43,909 కోట్లకు చేరుతుంది.