ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై బాబు షాకింగ్ నిర్ణయం?

Chakravarthi Kalyan
కాలేజీ విద్యార్థుల ఫీజు రీఎంబర్స్‌మెంట్‌పై చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కళాశాలలకు ఫీజ్ రీఎంబెర్స్మెంట్ నేరుగా ప్రభుత్వం చెల్లిస్తుంది కాబట్టి ఎక్కడా విద్యార్థులు చదువుకు ఇబ్బంది పడకందా కలెక్టర్లకు బాధ్యత అప్పగించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఫీజ్ రీఎంబర్స్మేంట్ భారం విద్యార్థులపై లేకుండా  కళాశాలలకు దశల వారీ చెల్లింపులు చేస్తూ విద్యాసంస్థలు, తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

అలాగే రెవెన్యూ సదస్సుల్లో ఇప్పటివరకు 13వేల కు పైగా దరఖాస్తులు వచ్చాయన్న అధికారులు ఒకే సమస్యపై పదే పదే తిరగకుండా ఎంత త్వరగా పరీష్కారం చూపామన్నదే కీలకం కావాలని సీఎం చంద్రబాబు అంటున్నారు. జగన్ 21వేల కోట్ల రూపాయల ఉద్యోగుల సేవింగ్ నిధులు మళ్లించాడని భావిస్తున్న చంద్రబాబు... ఉద్యోగులకు ఎలా న్యాయం చేయాలనే దానిపై కూడా చర్చించారు. జగన్ ఉద్యోగులకు చేసిన నష్టం భర్తీకి ప్రత్యామ్నాయం చూసి వారికి న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: