అల్లు అర్జున్ మా బంధువే.. రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్?
అల్లు అర్జున్ సతీమణి కుటుంబం మాకు బంధువులవుతారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారని తెలిసిందే. అలాగే.. అల్లు అర్జున్ మేనమామ చిరంజీవి కూడా కాంగ్రెస్ నేతేనని రేవంత్ రెడ్డి అన్నారు. అంతే కాదు.. అల్లు అర్జున్ సొంతమామ చంద్రశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్‌లోనే ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. పోలీసులు చేయాల్సిన పని వాళ్లు చేస్తారని... లా అండ్ ఆర్డర్ ప్రకారం నడుచుకుంటారని రేవంత్ రెడ్డి అన్నారు.