నా ఫేవరెట్ హీరో ఆయనే..ఓపెన్ గా చెప్పేసిన సీఎం రేవంత్ రెడ్డి
నేడు ఆయన ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రస్తుతానికి తనకు సమాచారం తెలియదని, తెలుసుకున్న తర్వాత మాట్లాడతానని తెలిపారు తప్పు ఎవరు చేసినా తప్పేనని.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. చట్టం ముందు అందరూ సమానమే అని వెల్లడించారు. నటులు సినిమాలు తీస్తూ డబ్బులు సంపాదించుకున్నారు అని చెప్పుకొచ్చారు. వాళ్లేం సరిహద్దుల్లో యుద్ధాలు చేయలేదని అన్నారు. అలాగే సినీ ప్రముఖులు ఎవ్వరూ దేశాన్ని చూసి ప్రపంచం గర్విచేలా ఎలాంటి విజయాలు సాదించలేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
తన ఫెవరెట్ టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ అని రేవంత్ రెడ్డి చెప్పారు. ఆయన ఇప్పుడు లేరని చెప్పుకొచ్చారు. ఇప్పుడైతే సినిమాలు పెద్దగా చూడటం లేదని అన్నారు. యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు కృష్ణ సినిమాలు చూసేవాడ్ని అని తెలిపారు. అయితే సినిమా వాళ్లు సినిమా కోసం పైసలు పెడతారు.. పైసలు సంపదిస్తారు అని అన్నారు. కానీ సినీ ప్రముఖులు ఎవ్వరూ కూడా ప్రత్యేకంగా దేశం కోసం చేసింది ఏం లేదని వెల్లడించారు.