టీవీ: బిగ్ బాస్ వల్లే సినీ కెరియర్ నాశనం..తెలుగు అమ్మాయి హాట్ కామెంట్స్..!
ఇటీవలే విడుదలైన అర్థమయిందా అరుణ్ కుమార్ సీజన్- 2 అనే వెబ్ సిరీస్ లో కూడా బికినీతో మరొకసారి ఈమె పేరు పాపులారిటీ చేసుకుంది.. ఈ సమయంలోనే బిగ్ బాస్ హౌస్ గురించి పలు విషయాలను తెలియజేసింది.. తన పేరు సినీ కెరియర్ నాశనం అవ్వడానికి ముఖ్య కారణం బిగ్ బాస్ సీజన్-2 కారణమని తెలిపింది. తాను కూడా ఒక జర్నలిజం స్టూడెంట్ ని అని ఒక ప్రోడక్ట్ ని అమ్మేటప్పుడు ఎదుటివారిని ఎలా ఇంప్రెస్ చేస్తారో అలా తన మీద కూడా ఒక ప్లాన్ ప్రకారమే నెగెటివిటీ జరిగిందని తెలిపింది.
ఇక వాటికి తోడు బిగ్ బాస్ షో కి వెళ్ళినప్పుడు తన వయసు 25 సంవత్సరాలని ఆ సీజన్ తనను చాలా బ్యాడ్ గా చేసిందని జనాలలోకి వచ్చేసరికి తన ఇమేజ్ మొత్తం పూర్తిగా మార్చేసిందని తెలిపింది తేజస్వి మడివాడ. దీంతో ప్రజల ఆలోచన కూడా తాను మార్చలేకపోయానని నేను ఎలా ఉండాలో అలాగే ఉండాలనుకున్నానని తెలిపింది. అయితే తాను ఏ బిగ్ బాస్ సీజన్ కూడా చూడనని.. ఒకసారి బిగ్ బాస్ కి వెళ్లి వచ్చిన తర్వాత సిగ్గున్నోడు ఎవరైనా సరే మళ్లీ ఆ వైపుగా వెళ్లాడా...? తాను కూడా వెళ్ళనని తెలియజేసింది.. తాను చూడడానికి రిచ్ కిడ్ గా కనిపిస్తానని తనకి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అందుకే తనకు వచ్చిన పాత్రలన్నీ కూడా చేస్తానని తెలిపింది తేజస్వి అది కూడా డబ్బుల కోసమే అని వెల్లడించింది.