అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టిన స్టార్ హీరోలు, డైరెక్టర్ లు!

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్‌ అయ్యారు. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా డిసెంబరు 4న హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ కి చాలా మంది అభిమానులు వచ్చరు. దీంతో థియేటర్‌ వద్ద తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌పై బీఎన్‌ఎస్‌ 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్‌ థియేటర్‌కు వచ్చిన సమయంలో భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోనందుకు థియేటర్‌ యాజమాన్యంపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ క్రమంలో పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి.. ఆయనను అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండిస్తూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. జాతీయ స్థాయిలో అవార్డ్ పొందిన అల్లు అర్జున్ ను ఈ విధంగా అరెస్ట్ చేయడం సరికాదని అన్నారు. తోక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబానికి నా సానుభూతి ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. కానీ ఈ ఘటనలో అల్లు అర్జున్ ని నేరస్థుడిలా చూడటం తప్పు అని చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ అరెస్ట్ పై కేటీఆర్ తో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌, నటి రష్మిక మందన్న ఇతర సినీ ప్రముఖులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇకపోతే బెల్ మీద ఐకన్ స్టార్ అల్లు అర్జున్ మరికాసేపట్లో తన నివాసానికి రానున్నారు. దీంతో అల్లు అర్జున్ నివాసానికి సినీ ప్రముఖులు క్యూ కట్టారు. ఇప్పటికే స్టార్ హీరో అల్లు అర్జున్ నివాసానికి డైరెక్టర్స్ సుకుమార్,  కే.రాఘవేంద్రరావు, హీరో రానా దగ్గుబాటి తదితరులు చేరుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: