ఏపీ సరిహద్దుల్లో లభించే ఎర్ర చందనం.. ఇప్పుడు గుజరాత్లో కలకలం సృష్టిస్తోంది. గుజరాత్ లోని పాటన్ లో 5 టన్నుల బరువు ఉన్న 155 ఎర్రచందనం దుంగల్ని ఆంధ్రా పోలీసులు పట్టుకున్నారు. ఏపీ రెడ్ సాండర్స్ టాస్క్ ఫోర్స్ పేరిట ఏర్పాటైన ప్రత్యేక దళం.. స్థానిక గుజరాత్ పోలీసుల సాయంతో ముగ్గురు స్మగ్లర్ లను అరెస్టు చేసింది.
ఈ స్మగ్లర్ ల నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్ర చందనం దుంగలు అంతర్జాతీయ మార్కెట్ లో రూ. 10 కోట్ల విలువ చేస్తాయని ఏపీ రెడ్ సాండర్స్ టాస్క్ ఫోర్స్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అలాగే స్మగ్లర్ ల నుంచి ఒక బ్రెజ్జా కారు కూడా స్వాధీనం చేసుకున్నట్టు ఏపీ రెడ్ సాండర్స్ టాస్క్ ఫోర్స్ వెల్లడించింది.
అరెస్టు చేసిన స్మగ్లర్ లను గుజరాత్ లోని స్థానిక పాటన్ కోర్టులో ప్రవేశ పెట్టి ట్రాన్సిట్ వారంట్ పై ఏపీ కి తరలిస్తామని ఏపీ రెడ్ సాండర్స్ టాస్క్ ఫోర్స్ అధికారులు వెల్లడించారు. అలాగే స్వాధీనం చేసుకున్న ఎర్ర చందనం దుంగలు కూడా తిరుపతికి తరలిస్తామని ఏపీ రెడ్ సాండర్స్ టాస్క్ ఫోర్స్ స్పష్టం చేసింది.