స్వచ్ఛంద సేవ ముసుగులో అక్రమాలు.. రూ. 300 కోట్లు హాంఫట్‌?

Chakravarthi Kalyan
హైదరాబాద్‌లో ఓ స్వచ్ఛంద సంస్థ విదేశాల నుంచి వచ్చిన విరాళాలు పక్కదారి పట్టించిన వ్యవహారంలో ఈడి సోదాలు  నిర్వహించింది. ఆపరేషన్ మొబిలిటి.. ఓఎమ్‌ సంస్థపై మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసింది. హైదరాబాద్ లో 11 చోట్ల సోదాలు చేసిన ఈడి.. తెలంగాణా సిఐడిలో నమోదైన కేసు ఆధారంగా మరో కేసు నమోదు చేసింది.

ఓఎమ్‌ సహా ఇతర సంస్థల పేరుతో విదేశాలకు చెందిన దాతల నుంచి 300కోట్ల మేర నిధులు సేకరించినట్లు పేర్కొన్న ఈడి.. యూఎస్‌, కెనడా, యూకె, ఆస్ట్రేలియా, అర్జంటీనా, డెన్మార్క్, జెర్మనీ, బ్రెజిల్‌,ఫిన్‌ లాండ్, ఐర్లాండ్, మలేషియా, రూమేనియా, సింగపూర్, నార్వే సహా ఇతర దేశాల నుంచి సేకరించినట్లు తెలిపింది. తాము నిర్వహిస్తున్న సుమారు 100 పాఠశాలల్లో చదువుతున్న దళితులు, అనాధ పిల్లలకు సౌకర్యాల కల్పిస్తామని తెలిపి ఈ సంస్థ విరాళాలు సేకరించింది. ఉచిత విద్య, ఆహరం సహా ఇతర సౌకర్యాలు కల్పిస్తామని తెలిపిన సంస్థ.. విరాళాలు పక్క దారి పట్టించి పాఠశాలల్లో విద్యార్ధుల నుంచి 1000-1500 వసూలు చేస్తున్నట్లు గతంలో గుర్తించింది. విరాళాల ద్వారా ఓమ్‌ సంస్థ తెలంగాణా, గోవా, కర్నాటక, కేరళ, మహరాష్ట్రలో ఆస్థులు కొనుగోలు చేసినట్లు ఈడీ గుర్తించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

om

సంబంధిత వార్తలు: