తెలంగాణ ఆర్టీసీ కొత్త లోగో ఇదేనా? సజ్జనార్ సంచలనం?
కొత్త లోగో విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదన్న ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్.. అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదని తెలిపారు. టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో అంటూ సోషల్ మీడియాలో ప్రచారంచేస్తోన్న లోగో ఫేక్ అని ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ చెప్పారు. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదని.. కొత్త లోగోను సంస్థ రూపొందిస్తోందని ఆర్టీసీ ఎండీ సజ్జన్నర్ వివరణ ఇచ్చారు. కొత్త లోగోను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఇంకా ఫైనల్ చేయలేదన్న ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్.. చేశాక మీడియాకు విడుదల చేస్తామన్నారు.