ఏపీలో సంచలనం.. ఉపముఖ్యమంత్రిపై కేసు నమోదు?
ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పై కేసు నమోదు చేసిన టూ టౌన్ పోలీసులు.. అంజాద్ భాషాతో పాటు మరో 21 మంది వైకాపా కార్యకర్తలపైనా కేసులు నమోదు చేశారు. అంతే కాదు. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి పైనా కేసు నమోదు చేశారు. శ్రీనివాసులు రెడ్డి తో పాటు మరో 24 మంది తేదేపా కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. కేసులు నమోదైన వారికి పోలీసులు 41- ఏ నోటీసులు అందజేస్తున్నారు.