ఏపీ: భారీగా పోస్టల్ ఓట్లు.. ఆ పార్టీకే అనుకూలమా?
పోస్టల్ బ్యాలట్ వినియోగించుకునేందుకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు మండుటెండల్లోనూ ఉత్సాహం కనబరుస్తున్నారు. కొన్నిచోట్ల అధికారులు.. అటూ ఇటూ తిప్పుతున్నా ఓపిగ్గా వెళ్తున్నారు. కొన్నిచోట్ల ఫాం 2 దరఖాస్తు ఇచ్చినా వారి పేర్లు ఓటరు జాబితాల్లో ఉండటం లేదు. మరోసారి రావాలని సూచిస్తున్నారు. పోస్టల్ ఓట్లంటే ఉద్యోగ, ఉపాధ్యాయులు, ఒప్పంద ఉద్యోగులవే కాబట్టి.. ఎక్కువగా ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని కూటమి నేతలు ఆశలు పెట్టుకుంటున్నారు.