హోరెత్తించబోనున్న జగన్‌.. కూటమి తట్టుకుంటుందా?

Chakravarthi Kalyan
ఈ నెల 27 నుంచి వైసీపీ అధ్యక్షుడి హోదాలో సీఎం వైఎస్ జగన్ బస్సుయాత్ర ప్రారంభించబోతునత్నారు. ఇడుపుల పాయ నుంచి ఉత్తరాంధ్రవరకు సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర చేస్తారు. ఈనెల 27 న ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్ .. ఎన్నికల సమరానికి కార్యకర్తలను సిద్దం చేసేందుకు బస్సు యాత్ర చేపడుతున్నారు. సిద్దం బహిరంగ సభలు జరిగిన ప్రాంతాలు మినహా మిగిలిన చోట బస్సు యాత్ర జరుగుతుంది. నోటిఫికేషన్ వచ్చే సమయం వరకు ఈ బస్సు యాత్ర కొనసాగుతింది.

నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల సభలు నిర్వహించాలని వైసీపీ నిర్ణయించింది. ఈనెల 27న ఉదయం ఇడుపుల పాయలో వైఎస్ ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్న సీఎం జగన్.. బస్సుయాత్ర ద్వారా మధ్యాహ్నం 3 గంటలకు  ప్రొద్దుటూరు చేరుకుని తొలి బహిరంగసభలో పాల్గొంటారు. ప్రతి రోజూ ఉదయం 9.30 కు వివిధ వర్గాల ప్రజలతో  సీఎం జగన్  ముఖాముఖి ఉంటుంది. ఈ నెల 28 న నంద్యాల లో సీఎం వైఎస్ జగన్ ఎన్నికల బహిరంగ సభ ఉంటుంది. ఈ నెల 30 న ఎమ్మిగనూరు లో సీఎం వైఎస్ జగన్ ఎన్నికల  బహిరంగ సభ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: