మీరు జాగ్రత్త.. బ్యాంకు లావాదేవీలపై నిఘా?

Chakravarthi Kalyan
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బ్యాంకుల్లో అనుమానాస్పద లావాదేవీలపై కేంద్ర ఎన్నికల కమిషన్ నిఘా పెడుతోంది. బ్యాంకుల నుంచి సమాచారం సేకరించాలని రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. పది లక్షల రూపాయలు డిపాజిట్ లేదా విత్ డ్రా చేస్తే ఆ ఖాతాల వివరాలను వెంటనే ఆదాయపన్ను శాఖకు సమాచారం ఇవ్వాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది.
గత రెండు నెలల్లో ఎన్నడూ లేని విధంగా జరిగే లావాదేవీలను అనుమానించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది. రెండు నెలల్లో ఎప్పుడూ లేని విధంగా లక్ష రూపాయలకు మించి డిపాజిట్ లేదా విత్ డ్రా చేసిన ఖాతాల వివరాలను బ్యాంకుల నుంచి సేకరించాలని సీఈవోలకు ఈసీ తెలిపింది. గత రెండు నెలల్లో లేని విధంగా ఒకే జిల్లా లేదా నియోజకవర్గంలో అనేక మందికి ఆన్ లైన్ నగదు బదిలీ చేసే ఖాతాల వివరాలను బ్యాంకుల నుంచి తెప్పించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. లక్ష రూపాయలకు మించి డిపాజిట్ లేదా విత్ డ్రాలు జరిగిన రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యుల ఖాతాల వివరాలు సేకరించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: