ఆ డీఎస్పీ వద్దు.. ప్రణీత్‌రావు హైకోర్టు పిటీషన్‌?

Chakravarthi Kalyan
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న డీఎస్పీ ప్రణీత్‌ రావు హైకోర్టును ఆశ్రయించాడు.  తనను కస్టడీకి అప్పగిస్తూ కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ లంచ్ మోషన్ పిటీషన్ ప్రణీత్ రావు వేశాడు. వాస్తవాంశాలను పరిగణనలోకి తీసుకోకుండా కింది కోర్టు పోలీసు కస్టడీకి ఆదేశాలు జారీ చేసిందంటూ ప్రణీత్‌ రావు పిటిషన్‌లో పేర్కొన్నారు. కస్టడీకి అప్పగించేముందు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని ప్రణీత్ రావు పిటీషన్‌లో తెలిపారు. రహస్యం పేరుతో బంజారాహిల్స్‌ పీఎస్‌లో తనను ప్రశ్నిస్తున్నారని.. అక్కడ రాత్రి వేళ నిద్రపోవడానికి సరైన సౌకర్యం లేదని ప్రణీత్ రావు అన్నాడు.
అందువల్ల విచారణ పూర్తయిన తరువాత తిరిగి జైలుకే తరలించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఇంటరాగేషన్ సమయంలో ఏఎస్పీ డి రమేశ్ పాల్గొనకుండా నియంత్రించాలని ప్రణీత్ రావు కోరారు. ఈ పిటిషన్ విచారించిన జస్టిస్ జి.రాధారాణి పోలీసుల వివరణ కోరుతూ బుధవారానికి వాయిదా వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: