హైదరాబాద్‌ అభివృద్ధి.. ఐఏఎస్‌లకు పాఠాలు?

Chakravarthi Kalyan
హైదరాబాద్ నగర అభివృద్ధి అంశం ఐఏఎస్‌లకు పాఠ్యాంశంగా మారింది. హైదరాబాద్‌ అభివృద్ధికి  ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ ట్రైనీ ఐఏఎస్‌లకు తెలిపారు. ఆరు రాష్ట్రాలకు చెందిన శిక్షణలో ఉన్న ఐఏఎస్ లు బెస్ట్ ప్రాక్టీసెస్ పై అధ్యయనం చేయడానికి జిహెచ్ఎంసి ని సందర్శించారు. ముస్సోరి లో ట్రైనింగ్ పొందుతున్న హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన 16 మంది ఐఏఎస్ లు రెండు రోజుల పర్యటనలో భాగంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు.  
కమిషనర్ రోనాల్డ్ రోస్ జీహెచ్ఎంసి బెస్ట్ ప్రాక్టీసెస్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి  వివరించారు. ప్రతిరోజు 4500 స్వచ్ఛ ఆటోల ద్వారా నగరంలో ఇంటింటి నుండి చెత్త సేకరణ చేయడం జరుగుతుందని, ప్రతి రోజు 7500 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించి జవహర్ నగర్ డంప్ యార్డు తరలిస్తున్నట్లు తెలిపారు. ఆ చెత్తతో వర్మి కంపోస్టు తయారీ అవుతుందన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: