వాలంటీర్లు.. జగన్ సొంత సైన్యం అన్న ఆరోపణలు ఉన్నాయి. వాలంటీర్ల సాయంలో జగన్ ఎన్నికలు కూడా నెగ్గాలని చూస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే.. ఎన్నికలతో ముడిపడిన ఎలాంటి ప్రక్రియలోనూ గ్రామవార్డు వాలంటీర్లు పాల్గోనకుండా చూడాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు విడుదల కానున్న దృష్ట్యా వాలంటీర్లను అన్నిరకాల ఎన్నికల విధుల నుంచి తక్షణం తొలగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు.
వాలంటీర్లు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ప్రక్రియలో పాల్గోన్నా అది ఈసీ మార్గదర్శకాల ఉల్లంఘనేనని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. పోలింగ్ ఏజెంట్లుగానూ వాలంటీర్లు అర్హులు కారని పేర్కోంటూ కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఈమేరకు జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలిచ్చారు.