ఇవాళ టీడీపీ సెకండ్‌ లిస్ట్ రిలీజ్‌.. అదిరే ట్విస్ట్?

Chakravarthi Kalyan
ఇవాళ చంద్రబాబు తెలుగుదేశం అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటించనున్నారు. ఇప్పటికే తొలి జాబితాలో 94మంది అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు.. పొత్తులో జనసేన, భాజపాలకు 31అసెంబ్లీ సీట్లు కేటాయించారు. ఇంకా మరో 50మంది అసెంబ్లీ అభ్యర్థుల్ని చంద్రబాబు ప్రకటించాల్సి ఉంది. అయితే టీడీపీ తొలి జాబితాలో ఎంపీ అభ్యర్థులకు చోటు దక్కలేదు. పొత్తులో 8పార్లమెంట్ స్థానాలు జనసేన, భాజపాలకు కేటాయించిన చంద్రబాబు 17స్థానాల్లో టీడీపీ పోటీ చేయనున్నారు.


అయితే.. ఇవాళ్టి జాబితాలో పలువురు ఎంపీ అభ్యర్థుల పేర్లను చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉంది. 17మంది ఎంపీ, 50అసెంబ్లీ కలిపి మొత్తం 67మంది అభ్యర్థుల్ని చంద్రబాబు ఇంకా ప్రకటించాల్సి ఉంది. అయితే... ఇవాళ్టి జాబితాలో ఎన్ని పేర్లు ప్రకటిస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అంతే కాదు.. ఇప్పటికే ప్రకటించిన తొలి జాబితా పేర్లలో ఒకటి, రెండు చోట్ల అభ్యర్థులను చంద్రబాబు మార్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: