రహస్య ప్రాంతంలో కేసీఆర్‌ గూఢచారి విచారణ?

Chakravarthi Kalyan
ఎస్‌ఐబి మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు ఆధారాలను  ధ్వంసం చేసినట్లు అధికారులు గుర్తించారు. సుమారు వేల కొలదీ కాల్‌ డీటైల్‌ రికార్డులు ను ధ్వంసం చేసినట్లు గుర్తించారు. నిందితుడు ప్రణీత్‌ రావు బేగంపేట లోని ఎస్‌ఐబి కార్యాలయంలో పనిచేసిన సమయంలో ప్రత్యేక కంప్యూటర్లను, ఇంటర్నెట్ సదుపాయాన్ని ఏర్పాటు చేసుకుని ఐపి అడ్రస్‌లు, సిడిఆర్‌ లు, ఐఎంఈఐ నంబర్లు సేకరించినట్టు భావిస్తున్నారు. ఎస్‌ఐబి మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు వ్యవహరంపై దర్యాప్తును వేగవంతం చేసేందుకు ప్రత్యేక బృందంలో సైబర్ క్రైం పోలీసు అధికారులను కూడా ఉంచారు.

ఇప్పటికే ప్రణీత్ రావు ఫోన్లు స్వాధీనం చేసుకున్న  పోలీసులు.. రహస్య ప్రదేశంలోనే ఆయన్ను విచారణ చేస్తున్నారు. త్వరలోనే అతడిని కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. మరి ఆయన విచారణలో నోరు విప్పితే కేసీఆర్‌కు తలనొప్పులు తప్పకపోవచ్చు. గతంలో ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లి ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి కూడా అలా అవుతుందేమో అన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: