తేలిన కూటమి లెక్క.. జనసేనకు మళ్లీ బొక్క?

Chakravarthi Kalyan
తెలుగుదేశం, జనసేన, బీజేపీ మధ్య సీట్లు సర్దుబాటు కొలిక్కి వచ్చింది. తెలుగుదేశం 144,జనసేన 21,భాజపా 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. లోక్ సభ స్థానాల విషయంలో తెలుగుదేశం 17, భాజపా 6, ,జనసేన 2 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. అరకు, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, నరసాపురం, తిరుపతి పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ పోటి చేస్తుంది. రాజమండ్రి నుంచి పురంధేశ్వరి, నర్సాపురం నుంచి రఘురామకృష్ణంరాజు అభ్యర్థిత్వాలు దాదాపు ఖరారు అయ్యాయి.  కాకినాడ,మచిలీపట్నం పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటిచేయనుంది. మిగతా 17 లోక్‌సభ స్థానాల్లోను తెలుగుదేశం పోటీ చేస్తుంది.

బీజేపీ ఇవాళ ప్రకటించే రెండో విడత లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ఒకరిద్దరి పేర్లు ఉండే అవకాశం ఉంది. ధర్మవరం, జమ్మలమడుగు, బద్వేలు, కైకలూరు, విశాఖ ఉత్తరం, పాడేరుతోపాటు మరో నాలుగు అసెంబ్లీ  స్థానాల్లో బీజేపీ పోటీచేయబోతోంది. ఫైనల్‌గా జనసేనకు ముందుగా అనుకున్న 24 అసెంబ్లీ సీట్లలో మరో 3 తగ్గాయి. ఎంపీ స్థానంలో ఒకటి తగ్గింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: